ETV Bharat / entertainment

'బాహుబలి సినిమాకు స్ఫూర్తి సూర్యనే- ఆయనతో సినిమా చేయాలకున్నా కానీ!'

కంగువా ప్రీ రిలీజ్​కు హాజరైన రాజమౌళి- ఈవెంట్​లో సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kanguva Pre Release Event
Kanguva Pre Release Event (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Kanguva Pre Release Event : కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ పాన్ఇండియా మూవీ 'కంగువా'. ఈ సినిమాకు డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. నవంబర్​ 14న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ గురువారం హైదరాబాద్​లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి హీరో సూర్యపై ప్రశంసలు కురిపించారు. సూర్య స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా సినిమాలు తీయగలిగినట్లు తెలిపారు.

దానికి స్ఫూర్తి సూర్యనే
'తెలుగు సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే నాకు స్ఫూర్తి. 'గజిని' రిలీజ్ టైమ్​లో సూర్య ఇక్కడకు వచ్చి సినిమా ప్రమోట్ చేసిన విధానాన్ని గమనించా. ఇతర సినీఇండస్ట్రీకి చెందిన నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర అయ్యాడు? అనే దాన్ని కేస్‌స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పేవాడిని. సూర్య ఇక్కడికి వచ్చి తెలుగు ప్రేక్షకుల ప్రేమ పొందినట్లే, మనం కూడా ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడి ఆడియెన్స్ ప్రేమను పొందాలని చెప్పేవాడిని. సూర్యు నా పాన్ ఇండియా మూవీ 'బాహుబలి'కి నువ్వే ఇన్‌స్పిరేషన్‌' అని రాజమౌళి సూర్యను ఉద్దేశించి చెప్పారు.

అది కుదరలేదు
సూర్యతో కలిసి సినిమా చేయాలనుకున్నా అది కుదరలేదని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. 'నాతో సినిమా చేయడం మిస్ అయ్యా అని సూర్య ఓ ఈవెంట్​లో అన్నారు. కానీ, ఆ అవకాశం మిస్ అయ్యింది సూర్య కాదు. నేనే ఆయనతో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యా. సూర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగా నచ్చుతాయి' అని అన్నారు. ఇక 'కంగువా' టీమ్ ఎంత కష్టపడిందో మేకింగ్ వీడియో చూస్తే అర్థమైందని అన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నేను ట్రైన్ మిస్ అయ్యా
రాజమౌళితో సినిమా ఛాన్స్ ఉద్దేశించి సూర్య మాట్లాడారు. 'సర్‌ నేను ట్రైన్‌ మిస్‌ అయ్యా (రాజమౌళితో సినిమా చేయలేకపోవడం). ఇప్పటికీ రైల్వే స్టేషన్‌లోనే నిలబడి ఉన్నాను. ఏదో ఒక రోజు ట్రైన్‌ ఎక్కుతానని అనుకుంటున్నా. మనలో చాలామంది కుటుంబ సభ్యుల ఫొటోనో, దేవుడి చిత్రాలో ఫోన్‌లో వాల్‌ పేపర్‌గా పెట్టుకుంటాం. కొంతకాలంగా మా సినిమా నిర్మాత జ్ఞానవేల్‌ మీ ఫొటో పెట్టుకున్నారు. 'కంగువా'లాంటి సినిమాలు తీసేందుకు దారి చూపింది మీరే' అని సూర్య అన్నారు.

10,000 స్క్రీన్స్‌లో 'కంగువా' భారీ రిలీజ్​- సౌత్​లో ఎన్ని థియేటర్లంటే?

'అన్​స్టాపబుల్'​లో కంగువా హీరో! - ఆడియెన్స్​ ముందు కంటతడి పెట్టిన సూర్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.