దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా మేనేజర్ హర్లీ మెడ్కాఫ్.. భారత దివ్యాంగుల క్రికెట్ సంస్థ (పీసీసీఏఐ)కు రూ.లక్ష 50 వేలు విరాళమిచ్చి మంచి మనసు చాటుకున్నారు. ఇందులో భాగంగా 30 మంది దివ్యాంగ ఆటగాళ్లకు రూ.5 వేలు చొప్పున, వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు.
కరోనా ప్రభావంతో క్రికెట్ మ్యాచ్లు నిలిచిపోవడం వల్ల పీసీసీఏఐలోని క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేశారు హర్లీ. స్టీవ్ వాతో కలిసి ఓసారి భారత్ పర్యటనకు వచ్చినప్పుడు, ఈ సంస్థతో తనకు అనుబంధం ఏర్పడిందని అన్నారు హర్లీ. అయితే విరాళం ఇచ్చినందుకు ఆయనకు పీసీసీఏఐ కృతజ్ఞతలు తెలిపింది.
ఇది చూడండి : మీ త్యాగం అమరం.. వీరజవాన్లకు క్రీడాకారుల నివాళి