ETV Bharat / sports

స్టీవ్​ వా అత్యంత స్వార్థపరుడు: షేన్​ వార్న్​ - షేన్​ వార్న్​ లేటెస్ట్​ న్యూస్​

తనతో ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లలో దిగ్గజ క్రికెటర్​ స్టీవ్​ వా అత్యంత స్వార్థపరుడని అంటున్నాడు ఆసీస్​ మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్. అంతర్జాతీయ కెరీర్​లో అతడితో ఆడిన బ్యాటింగ్​ భాగస్వాములు ఎక్కువగా రనౌట్లు అయ్యారని తెలిపాడు.

Steve was easily the most selfish cricketer I ever played with Warne
స్టీవ్​ వా అత్యంత స్వార్థపరుడు: షేన్​ వార్న్​
author img

By

Published : May 17, 2020, 9:37 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి అస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వాను బ్యాటింగ్‌ లెజెండ్లలో ఒకరిగా పరిగణిస్తారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ కెప్టెన్లలో ఆయన ఒకరని అందరూ అంగీకరిస్తారు. అయితే తనతో ఇప్పటివరకూ ఆడిన ఆటగాళ్లందరిలో స్టీవ్‌ వా అత్యంత స్వార్ధపరుడంటూ... ఆస్ట్రేలియాకే చెందిన మరో దిగ్గజం షేన్‌ వార్న్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టీవ్‌ వాకు ఉన్న రనౌట్‌ రికార్డే ఇందుకు రుజువని వార్న్‌ అంటున్నాడు.

స్టీవ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో రనౌట్‌ భాగస్వామి అయిన 104 సందర్భాల్లో అధికంగా, అంటే 73 సార్లు వా భాగస్వామే బలయ్యాడు... అంటూ క్రికెట్‌ విశ్లేషకుడు రాబ్‌ మూడీ, ఆ మొత్తం దృశ్యాలు కలిగిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ఓ గంట నిడివి గల ఈ వీడియోను తయారు చేసేందుకు తనకు 24 గంటలు పట్టిందంటూ అతను తెలిపాడు. ఈ అంశంపై ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ స్పందిస్తూ... "నాతో ఆడిన ఆటగాళ్లందరిలో అత్యంత స్వార్ధపరుడు స్టీవ్‌. ఇదే విషయాన్ని నేను 1000 సార్లు చెప్పాను.. మళ్లీ చెప్తున్నాను. స్టీవ్‌ వా అంటే నాకేమీ ద్వేషం లేదు. మీ అందరికీ తెలియని విషయమేమిటంటే, అతనిని నేను ఇటీవలే 'ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ఆస్ట్రేలియన్‌ టీమ్‌'కు ఎంపిక చేసుకున్నాను" అని వ్యాఖ్యానించాడు.

1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోవటంలో స్టీవ్‌ వా పాత్ర గణనీయమైనది. స్టీవ్​ వా సామర్థ్యంపై ఎవరికీ ఏ అనుమానాలు లేవని... అయితే అతని పేరున ఉన్న రనౌట్‌ గణాంకాలు చంద్రునిలో మచ్చలాగా పరిణమించాయని పలువురు క్రికెట్‌ పరిశీలకులు అంటున్నారు.

ఇదీ చూడండి.. లాక్​డౌన్​ క్రికెటర్లు: ఆన్​లైన్​లో​ఆట.. లైక్​ల వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.