ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఐపీఎల్​కు ఓకే' - IPL 2020 news

డేనైట్ టెస్టుల విషయంలో భారత్​ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ ప్రయోజనం ఉందని అన్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్​ స్మిత్​. భారత బ్యాట్స్​మెన్లకు ఇది ఛాలెంజింగ్​గా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​ నిర్వహిస్తే అందులో పాల్గొనడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు స్మిత్​.

Steve Smith wants to play IPL if T20 World Cup is postponed
'టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే ఐపీఎల్​కు ఓకే'
author img

By

Published : Jun 1, 2020, 4:51 PM IST

డిసెంబర్​లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమ్​ఇండియా. నాలుగు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా ఓ డేనైట్ టెస్టు ఆడనుంది. అయితే భారత్​ కంటే ఆస్ట్రేలియా ఎక్కువ పింక్​ బాల్​ టెస్టులు ఆడటం తమకు కొంత ప్రయోజనకరంగా మారనుందని అభిప్రాయపడ్డాడు ఆసీస్​ మాజీ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్. ఈ టెస్టు భారత బ్యాట్స్​మెన్లకు ఛాలెంజింగ్​గా ఉండబోతోందని అన్నాడు.

ఇప్పటికే డేనైట్​ టెస్టు ఆడిన అనుభవం భారత్​కు ఉందని.. అందులో వారు బాగా ఆడారని తెలిపాడు స్మిత్. కఠినమైన పరిస్థితులకు అనుగుణంగా భారత బ్యాట్స్​మెన్లు నిలబడ్డారని వెల్లడించాడు. వాళ్లు ప్రపంచస్థాయి ఆటగాళ్లు కాబట్టి దేనినైనా ఎదుర్కోగలరని.. అందువల్ల ఈ టెస్టు అద్భుతమైన పోటీగా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు. ​

బంతి మెరుపు కోసం లాలాజలం వాడకూడదనే ఐసీసీ విధించిన నిబంధనపై స్మిత్​ స్పందించాడు. బ్యాట్​, బంతికి కచ్చితంగా పోటీ అవసరమని.. అయితే ప్రస్తుతం దాని గురించి అంతగా అవగాహన లేదని, కాలమే దానికి సమాధానం చెబుతుందని స్పష్టం చేశాడు.

ఐపీఎల్​ ఆడటానికి సిద్ధం!

టీ20 ప్రపంచకప్​ వాయిదా, ఐపీఎల్​ నిర్వహణపై తాజాగా స్పందించాడు స్మిత్​. "ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​లో కచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే అదే ఉత్తమ టోర్నమెంట్​. ఒకవేళ టీ20 ప్రపంచకప్​ వాయిదా వేసి.. ఆ సమయంలో ఐపీఎల్​ నిర్వహిస్తే దానిలో పాల్గొనడానికీ నాకు అంగీకారమే. ఎందుకంటే లీగ్​ల్లో అదే ఉత్తమమైంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో టోర్నీల నిర్వహణ ఎవరి నియంత్రణలో లేదు" అని తెలిపాడు స్టీవ్​స్మిత్.

మే 28న ఐసీసీ నిర్వహించిన సమావేశంలో టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై పూర్తి స్పష్టత రాలేదు. జూన్​ 10 వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని మరోసారి చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) తెలిపింది.

ఇదీ చూడండి... 'గంభీర్​, అఫ్రిదీ.. గొడవలు ఆపేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.