ETV Bharat / sports

అసలు ఆడలేననుకున్నాడు.. కానీ సెంచరీ చేశాడు! - india vs australia

అసలు రెండో వన్డేలో ఆడతానని అనుకోలేదని ఆసీస్ బ్యాట్స్​మన్ స్మిత్ చెప్పాడు. జట్టు వైద్య సిబ్బంది సహకారంతో మ్యాచ్​లో పాల్గొన్నానని అన్నాడు. ఇంతకీ ఏం జరిగింది?

Steve Smith almost missed SCG ODI for THIS reason
అసలు ఆడననుకున్నాడు.. కానీ సెంచరీ చేశాడు!
author img

By

Published : Nov 30, 2020, 11:10 AM IST

Updated : Nov 30, 2020, 11:15 AM IST

టీమ్​ఇండియాతో వన్డే సిరీస్​లో వరుస శతకాల చేస్తూ జోరు మీదున్న స్మిత్.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్​లో బ్యాటింగ్ చేయలేక కష్టపడింది ఇతడేనా అని సందేహపడేలా చేస్తున్నాడు. రెండో వన్డేలో శతకంతో(104) అదరగొట్టిన స్మిత్.. ఆరోజు ఉదయం తనకు జరిగిన ఆసక్తికర సంఘటన గురించి చెప్పాడు. అసలు ఆడతానో లేదో అనుకున్న మ్యాచ్​లో బాగా బ్యాటింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు.

Steve Smith almost missed SCG ODI for THIS reason
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్

"ఆరోజు(ఆదివారం) ఉదయం నాకా బాగా తల తిరిగినట్లు అనిపించింది. మైదానంలోకి వచ్చి కొంచెం దూరం పరుగెత్తే వరకూ చాలా ఇబ్బందిగానే అనిపించింది. ఎక్సర్​సైజ్ చేసి, చెవిలోని గులిమి తీసిన తర్వాత హాయిగా అనిపించింది. అసలు ఆడతానో లేదే అనుకున్నా మ్యాచ్​లో పాల్గొని జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది" -స్టీవ్ స్మిత్, ఆసీస్ బ్యాట్స్​మన్

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో ఆసీస్, నిర్ణీతో 50 ఓవర్లలో 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో చాలా ప్రయత్నించిన టీమ్​ఇండియా, ఓవర్లన్నీ ఆడి 338 పరుగులే చేయగలిగింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2020, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.