ETV Bharat / sports

స్మిత్ అమాయకుడు.. అతడ్ని నిందించకండి: లాంగర్

పంత్​ బ్యాటింగ్​ గార్డ్​ మార్క్​ను స్టీవ్​స్మిత్​ చెరిపివేశాడన్న ఆరోపణలపై ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ జస్టిన్​ లాంగర్ స్పందించాడు. స్మిత్​.. వందకు వందశాతం అమాయకుడని ఆయన అభిప్రాయపడ్డాడు. అలాంటి నిందలను స్మిత్​పై మోపడం సరికాదని తెలిపాడు.

Steve Smith 100 percent innocent: Australia coach Justin Langer slams criticism over pitch scruffing
స్మిత్ అమాయకుడు.. అతడ్ని నిందించకండి: లాంగర్
author img

By

Published : Jan 13, 2021, 10:27 AM IST

Updated : Jan 13, 2021, 10:56 AM IST

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​పై వస్తున్న విమర్శలను ఆ జట్టు ప్రధానకోచ్​ జస్టిన్​ లాంగర్​ తిప్పికొట్టాడు. స్మిత్​పై వస్తోన్న ఆరోపణలు అర్థరహితమని అభిప్రాయపడ్డాడు.

"స్మిత్ గురించి వస్తున్న వార్తలు ముమ్మాటికీ హాస్యాస్పదం. సిడ్నీ పిచ్​పై బ్యాటింగ్​ గార్డ్​ మార్క్​ చెరపడం సులువుకాదు. పంత్ మార్కింక్ తొలగించడానికి స్మిత్​కు కనీసం 15అంగుళాల స్పైక్స్​ కావాలి. పిచ్​పై బ్యాటింగ్​ చేస్తున్నట్టు ఊహించుకోవడం అతడికి అలవాటు. దానికి మేము చాలాసార్లు నవ్వుకున్నాం. ఈ విషయంలో అతడు 100శాతం నిరపరాధి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు నా జీవితంలో ఎన్నడూ వినలేదు. ఇక ఆపండి."

- జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్​

సిడ్నీ టెస్టు చివరిరోజున తొలి సెషన్​లో స్మిత్​.. పంత్​ బ్యాటింగ్ గార్డ్​ మార్క్​ను చెరిపివేశాడని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో స్టంప్స్​ కెమెరాలో రికార్డు అయ్యింది. అది కాస్త నెట్టింట వైరల్​గా మారగా.. స్మిత్​పై నెటిజన్లు, క్రికెట్ మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, మైఖేల్ వాన్ సహ పలువురు నిప్పులు చెరిగారు. అయితే మైఖేల్ వాన్​ వ్యాఖ్యలను కోచ్​ లాంగర్​ తప్పుబట్టాడు​.

"నేను డారెన్ గౌ (ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్), మైఖేల్​ వాన్​లతో మాట్లాడాను. వాన్ తన పరిధి దాటినట్లు అనిపిస్తుంది. బయటి వ్యక్తుల విషయం వేరు. కానీ వాన్ అలా స్పందిస్తాడని ఊహించలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అతడు కడుపు నింపుకుంటున్నాడు." అని లాంగర్​ అన్నాడు.

ఇదీ చూడండి: సిడ్నీ టెస్టు: అయ్యా స్మిత్.. ఇదేం పని?

Last Updated : Jan 13, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.