ETV Bharat / sports

సచిన్​ విషయంలో ఆ రెండు తప్పులు చేశా: బక్నర్​

అంతర్జాతీయ క్రికెట్​లో వివాదాస్పద అంపైర్​గా పేరుతెచ్చుకున్న స్టీవ్​ బక్నర్​.. గతంలో ఇచ్చిన తప్పుడు నిర్ణయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సచిన్​ను రెండుసార్లు ఎల్బీ, క్యాచ్​ ఔట్​గా ప్రకటించినట్లు ఒప్పుకున్నారు.

author img

By

Published : Jun 21, 2020, 7:16 PM IST

Steve Bucknor
సచిన్​ ఔట్​ విషయంలో ఆ రోజు తప్పుచేశా: అంపైర్​

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ ​విషయంలో రెండుసార్లు తప్పుచేశానని ఒప్పుకున్నారు ఐసీసీ మాజీ అంపైర్​ స్టీవ్​ బక్నర్​. 2003లో జరిగిన మ్యాచ్​లో జేసన్​ గిలెప్సీ వేసిన బంతికి మాస్టర్​ను ఎల్బీగా ప్రకటించారు బక్నర్​. అయితే రీప్లేలో మాత్రం అది నాటౌట్​గా తేలగా.. బక్నర్​ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2005లో ఈడెన్​గార్డెన్స్​లో జరిగిన మరో మ్యాచ్​లో అబ్దుల్​ రజాక్​ వేసిన బంతి బ్యాట్​ ఎడ్జ్​ తాకుతూ కీపర్​ చేతుల్లో పడింది. దాన్ని ఔట్​గా ప్రకటించగా.. సచిన్​ మళ్లీ పెవిలియన్​ చేరాడు. రిప్లేలో అదీ నాటౌట్​గా తేలింది. ఇలా రెండుసార్లు తప్పుగా ఔట్​ ఇవ్వడంపై స్పందించారు బక్నర్​.

" తెందుల్కర్​ నాటౌట్​ అయినా రెండు సార్లు ఔటిచ్చాను. ఏ అంపైర్​ కావాలని అలా చేయరు. ఏ ఆటగాడి కెరీర్​ పాడుచేయాలని ఎవరూ అనుకోరు. మనుషులుగా ఒక్కోసారి తప్పులు చేస్తాం. ఒకసారి ఎల్బీ, మరోసారి క్యాచ్​ రూపంలో నేను తప్పిదాలు చేశాను. అయితే ఈడెన్​లో మ్యాచ్​ జరుగుతున్నప్పుడు వేల మంది అభిమానులతో సందడి ఉంటుంది. ఆ సమయంలో చిన్నపాటి ధ్వని గుర్తించడం కొంచెం కష్టం. అలాగే తప్పు జరిగింది. అయితే వాటి విషయంలో నేను చింతిస్తున్నాను. జీవితం అంటే తప్పులను ఒప్పుకోవడమే" అని చెప్పారు బక్నర్​

అంతర్జాతీయ క్రికెట్​లో ఎంతో పేరు సంపాదించిన బక్నర్​.. మైదానంలో టెక్నాలజీ వాడకం ముఖ్యమని స్పష్టం చేశారు. డీఆర్​ఎస్​కు ఆయన మద్దతు తెలిపారు. సాంకేతికత సాయంతో అంపైరింగ్​లో​ తప్పులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.