ETV Bharat / sports

ఆసీస్​కు మరో షాక్.. టీ20లకు స్టార్క్ దూరం

టీమ్​ఇండియాతో జరగనున్న చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్​ స్టార్క్​ అందుబాటులో ఉండట్లేదు. అతడి కుటుంబసభ్యుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల అతడు అత్యవసరంగా ఇంటికి వెళ్లడమే ఇందుకు కారణం.

starc
స్టార్క్
author img

By

Published : Dec 6, 2020, 10:24 AM IST

మరికొద్ది గంటల్లో టీమ్​ఇండియాతో జరగబోతున్న రెండో టీ20 ముంగిట ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్​ మిచెల్​ స్టార్క్​ ఈ మ్యాచ్​ సహా మూడో టీ20కి దూరమయ్యాడు. అతడి కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల అత్యవసరంగా స్టార్క్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆసీస్​ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. స్టార్క్​ జట్టులో మళ్లీ ఎప్పుడు చేరతాడనేది చెప్పలేమని వెల్లడించాడు.

అంతకుముందు వెన్నెముక, పక్కటెముక గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు స్టార్క్. ఆ తర్వాత కోలుకుని తొలి టీ20కి హాజరయ్యాడు. కాగా, ఇప్పటికే గాయం కారణంగా స్టార్​ బ్యాట్స్​మన్​ వార్నర్​ కూడా జట్టుకు అందుబాటులో ఉండట్లేదు.

తొలి టీ20లో విజయం సాధించిన టీమ్​ఇండియా.. ఈ పోరులోనూ గెలిచి సిరీస్​ తమ సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. అలాగే ఆసీస్​ కూడా ఓటమి నుంచి పుంజుకుని సిరీస్​ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.

ఇదీ చూడండి : భారత్​తో మిగతా మ్యాచ్​లకు వార్నర్​​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.