ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించేందుకు అన్నిదారులను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఒకవేళ ఇక్కడ వీలుకాకపోతే విదేశాల్లోనైనా జరపాలనే భావిస్తోంది. ప్రస్తుతం ఇదే విషయమై బోర్డులో చర్చలు జరుగుతున్నాయి.
గతంలో రెండుసార్లు(2009, 2014) ఇతర దేశాల్లో టోర్నీ నిర్వహించారు. ఇప్పుడు మాత్రం భారత్‌లో జరపడమే బీసీసీఐ మొదటి ప్రాధాన్యంగా తెలుస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ టోర్నీపై తుది నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
![Staging IPL outside India on table as BCCI looks at all options](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bcci-names-four-fast-bowlers-to-assist-team-india-for-world-cup-preparation_0406newsroom_1591257844_813.jpg)
ఐపీఎల్ 13వ సీజన్‌ను మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే సమయంలో కరోనా రావడం వల్ల టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశమున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను సెప్టెంబరు-నవంబరు మధ్యలో జరపాలని భావిస్తున్నారు. ఈ విషయాలపై త్వరలో పూర్తి స్పష్టత రానుంది.
ఇదీ చూడండి... గజరాజు మృతిపై క్రికెటర్ల ఆవేదన