ETV Bharat / sports

WC19: లంకేయుల ప్రభావం కనిపిస్తుందా..?

కొంత కాలంగా వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన శ్రీలంక జట్టు ఈ ప్రపంచకప్​లో ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తిగా మారింది. మెగాటోర్నీలో వారి బలాబలాలు ఓసారి చూద్దాం.

author img

By

Published : May 26, 2019, 6:00 PM IST

శ్రీలంక

ప్రపంచకప్ సమరానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 10 జట్లు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. కొంత కాలంగా వరుస ఓటములతో ఇబ్బందిపడుతోన్న శ్రీలంక జట్టు మెగాటోర్నీలో ఏలా ఆడుతుందో చూడాలి . ఓసారి ఈ జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతమున్న శ్రీలంక జట్టును చూస్తుంటే చాలా బలహీనంగా కనిపిస్తోంది. శ్రీలంక జట్టుకు తమ ప్రదర్శనపై పెద్దగా అంచనాలేమీ ఉండకపోవచ్చు. దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో జట్టులో బలం కోల్పోయిన లంక.. బోర్డులో రాజకీయాలు, అవినీతి కారణంగా మరింత దయనీయ పరిస్థితికి చేరుకుంది.

srilanka team in world cup
శ్రీలంక ప్రపంచకప్ జట్టు
చివరిసారి 2015 ప్రపంచకప్‌లో వన్డే మ్యాచ్‌ ఆడిన కరుణరత్నె.. ఈ ప్రపంచకప్‌లో ఆ జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. కొన్నేళ్ల నుంచి విజయముంటూ ఎరుగని లంక.. గతేడాది ఆసియా కప్‌లో పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలో 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 2015 నుంచి 98 వన్డే మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక కేవలం 29 గెలిచింది. 62 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. దాదాపు మూడేళ్లుగా వన్డే సిరీసే నెగ్గలేదు.

1975 ప్రపంచకప్​లో అరంగేట్రం చేసిన లంక జట్టు 1996లో ట్రోఫీని గెలుచుకుంది. 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది. మొత్తంగా ప్రపంచకప్‌లో 73 మ్యాచ్‌లు ఆడి 35 గెలిచింది. 35 ఓడింది. మూడు ఫలితం తేలలేదు.

srilanka team in world cup
1996 ప్రపంచకప్ గెలిచిన లంకేయులు

బలాలు
మాథ్యూస్ అనుభవం జట్టుకు కలిసొచ్చే అంశం. వన్డేల్లో అతడికి 42కు పైగా సగటు ఉంది. పేసర్ లసిత్‌ మలింగ ఎంతో కీలకం. మిగిలిన బౌలింగ్ యూనిట్​​లో అంత పదును లేదు. ఎక్కువగా మలింగపైనే ఆధారపడుతోంది. లక్మల్‌, తిసారా పెరీరా రూపంలో మరో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు లంకకు ఉన్నారు. బ్యాటింగ్‌లో మాథ్యూస్‌తో పాటు కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ కీలక పాత్ర పోషించనున్నారు.

srilanka team in world cup
శ్రీలంక

బలహీనతలు

కాగితంపై జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా.. ఇటీవల కాలంలోని పరాజయాలు శ్రీలంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. ఒక్క మ్యాచ్‌ విన్నరూ కనిపించట్లేదు. ఫిట్‌నెస్‌ సమస్యలూ ఉన్నాయి. పేస్‌ విభాగం పర్వాలేదనిపించేలా ఉన్నా.. మిగతా జట్లతో పోలిస్తే అంత బలంగా కనిపించదు. లంక స్పిన్‌ విభాగం కూడా అంత ప్రభావవంతంగా లేదు. స్పిన్నర్లందరికీ కలసి 100 వన్డేలు ఆడిన అనుభవం కూడా లేదు.

శ్రీలంక ప్రపంచకప్‌ జట్టు

కరుణరత్నె (సారథి), నువాన్‌ ప్రదీప్‌, సురంగ లక్మల్‌, మాథ్యూస్‌, జీవన్‌ మెండిస్‌, తిసార పెరీరా, లహిరు తిరిమానె, జెఫ్రీ వాండర్సే, ధనంజయ డిసిల్వా, అవిష్క ఫెర్నాండో, లసిత్‌ మలింగ, కుశాల్‌ మెండిస్‌, కుశాల్‌ పెరీరా, మిలింద సిరివర్దన, ఇసురు ఉదాన.

ఇవీ చూడండి.. WC19: 'పసికూన' కసితో చెలరేగుతుందా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo – 26 May 2019
1. Exterior of sumo arena
2. Close of flag with names of sumo wrestlers
3. Wide of police on road
4. Close of police
5. Mid of sumo arena
6. Pan of sumo wrestler walking
7. SOUNDBITE (Japanese) Mayuko Ueda, Office worker, and Kayoko Ueda, Part-time worker:
Mayuko Ueda: "An American leader who is trying to deepen friendship and coming to see a national sport, I hope that will deepen ties."
Kayoko Ueda: "I don't know too much and I think there are a few issues but through culture, if ties can deepen, I think that would be good."
8. Various of people walking
9. Close of flags with names of sumo wrestlers
10. SOUNDBITE (Japanese) Shinchiro Idehara, Government worker:
"Today I came to watch a sumo match, especially because President Trump was said to attend this match. After I knew he was attending, I bought the ticket."
11. Wide of sumo arena to zoom in of sumo wrestlers crossing road
12. SOUNDBITE (Japanese) Shinchiro Idehara, Government worker:
"If Trump had said that (he wanted to watch a sumo match), that means he has an understanding of Japanese culture, so I am happy to know that."
13. Various of police
14. Close of sumo wrestler walking
15. Pan of sumo arena
16. Various STILLS of "The President's Cup"
STORYLINE:
Security was beefed up around the arena for sumo wrestling in Tokyo on Sunday afternoon, hours ahead of the visit by the US President Donald Trump, who will be accompanied by Japanese Prime Minister Shinzo Abe.
Later in the day, Abe will introduce Trump to Japan's ancient sport of sumo. The president will sit ringside at a championship match featuring the oversized athletes. He'll also present the winner with his own "President's Cup" trophy.
Trump arrived Tokyo on Saturday to begin his four-day-state visit.
The president and his Japanese host, Abe, started their Sunday with a round of golf at a golf course in Chiba, east of Tokyo.
Abe is Trump's closest friend among world leaders and it's the fifth time they played golf together since Trump took office.
Abe's strategy is to keep his country out of Trump's crosshairs amid US-Japan trade tensions and the continued threat North Korea poses to both nations.
After the sumo, the leaders will also venture into Tokyo for a dinner double date with their wives.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.