భద్రత కారణాలతో కెప్టెన్ కరుణరత్నె, మలింగ, మాథ్యూస్ సహా పది మంది సీనియర్ ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లడానికి నిరాకరించినా.. పర్యటనను రద్దు చేయలేదు శ్రీలంక బోర్డు. ఆ దేశంలో మ్యాచ్లకు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అయినా శ్రీలంక జట్లు పాకిస్థాన్లో పర్యటించడం అనుమానంగానే ఉంది. పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చినట్టు లంక బోర్డు తెలిపింది. పాక్లో భద్రత పరిస్థితులు మరోసారి సమీక్షించాలని ప్రధానమంత్రి కార్యాలయం తమకు సూచించినట్లు చెప్పింది.
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ పర్యటనలో లంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్కు కెప్టెన్గా లాహిరు తిరిమన్నే, టీ20 జట్టుకు దసున్ను బోర్డు నియమించింది.
వన్డే జట్టు:
లాహిరు తిరుమన్నే(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో, ఒషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దసున్ శంకర, మినోద్ భానుక, ఏంజిలో పెరెరా, వనిందు హసరంగా, లక్షన్ సందకన్, నువాన్ ప్రదీప్, ఇసురు ఉదాన, కసున్ రజిత, లాహిరు కుమార
-
Sri Lanka ODI Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/eZjOux69Di
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka ODI Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/eZjOux69Di
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019Sri Lanka ODI Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/eZjOux69Di
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019
టీ20 జట్టు:
దసున్ శనక(కెప్టెన్), ధనుష్క గుణతిలక, సధీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో,ఒషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఏంజిలో పెరెరా, భానుక రాజపక్ష, మినోద్ భానుక, లాహిరు మదుశంక, వనిందు హసరంగ, లక్షన్, నువాన్ ప్రదీప్, కసున్ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదాన
-
Sri Lanka T20I Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/IhjXVvafMr
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka T20I Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/IhjXVvafMr
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019Sri Lanka T20I Squad for Pakistan tour. #PAKvSL pic.twitter.com/IhjXVvafMr
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2019
ఇవీ చదవండి...