పాకిస్థాన్‌లో క్రికెట్ పునరుద్ధరణకు పీసీబీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇటీవలే శ్రీలంక.. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అయితే టెస్టులు ఆడేందుకు కొంత సందిగ్ధం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత అంగీకరించింది. ఇందులో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు తాజాగా జట్టును ప్రకటించింది లంక బోర్డు. ఫలితంగా దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించనున్నారు పాక్ అభిమానులు.
పాకిస్థాన్‌లో రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక బలమైన జట్టును బరిలో దింపింది. మాజీ కెప్టెన్ దినేశ్ చండిమల్ చోటు దక్కించుకున్నాడు. దిముత్ కరుణరత్నె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
సెప్టెంబర్ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడారు లంక ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు. ఇందులో 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచింది పాక్. అయితే 3 టీ20ల సిరీస్‌ను లంక జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా టెస్టు పర్యటనకు సిద్ధమౌతోంది. రావల్పిండి వేదికగా డిసెంబర్ 11-15 వరకు మొదటి టెస్టు, కరాచీ వేదికగా 19-23 మధ్య రెండో టెస్టు జరుగుతుంది.
జట్టు ఇదే....
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమల్, కుశాల్ పెరీరా, లహిరు తిరమన్నె, ధనంజయ డిసిల్వా, నిరోషన్ డిక్వెల్లా, దిల్రువన్ పెరీరా, లసిత్ ఎంబుల్డెనియా, సురంగా లక్మల్, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, లక్షణ్ సందకన్.
-
Sri Lanka Test Squad for Pakistan Tour 2019; https://t.co/pD1uqTzbPU#PAKvSL pic.twitter.com/UUjIRaKXtX
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka Test Squad for Pakistan Tour 2019; https://t.co/pD1uqTzbPU#PAKvSL pic.twitter.com/UUjIRaKXtX
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2019Sri Lanka Test Squad for Pakistan Tour 2019; https://t.co/pD1uqTzbPU#PAKvSL pic.twitter.com/UUjIRaKXtX
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2019