ETV Bharat / sports

రెండుసార్లు ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ - మలింగ ముంబయ ఇండియన్స్

లంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ.. 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రెండుసార్లు ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ మలింగ
క్రికెటల్ మలింగ
author img

By

Published : Aug 28, 2020, 4:33 PM IST

అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతలు ఎన్నో ఉన్నాయి. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, ట్రిపుల్ సెంచరీలు నమోదు చేయడం, హ్యాట్రిక్‌ వికెట్లు తీయడం, ఒకే టెస్టులో 10 వికెట్లు పడగొట్టడం లాంటివి ఎన్నో చూశాం. కానీ ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు రెండుసార్లు తీసి చరిత్ర సృష్టించాడు. అతడే శ్రీలంక దిగ్గజ పేసర్‌ లసిత్‌ మలింగ. శుక్రవారం (ఆగస్టు 28) అతడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2007లో మలింగ తొలిసారి నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాపై 210 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు అతడు విశ్వప్రయత్నమే చేశాడు. వరుసగా నాలుగు వికెట్లు తీయడం వల్ల గెలిపిస్తాడనే అంతా అనుకున్నారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 44 ఓవర్లకే 200 పరుగుల మైలురాయిని దాటేసింది. కలిస్‌ లాంటి మేటి ఆల్‌రౌండర్‌ క్రీజులో ఉన్నాడు. ఆ క్రమంలో 44.5వ బంతికి పొలాక్‌ (13), 44.6వ బంతికి ఆండ్రూ హాల్‌ (0)ను పెవిలియన్‌ పంపించాడు. అప్పుడు స్కోరు 206. మళ్లీ 47వ ఓవర్‌కు బంతి అందుకున్నాడు. తొలి బంతికి జాక్వెస్‌ కలిస్‌ (86), తర్వాతి బంతికి మఖాయ ఎన్తిని (0)ని ఔట్‌ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. చేయాల్సిన స్కోరు తక్కువే ఉండటం వల్ల సఫారీలు విజయం సాధించారు.

గతేడాది సెప్టెంబర్‌లో పల్లెకెలెలో కివీస్‌తో జరిగిన టీ20లో మలింగ దానినే పునరావృతం చేశాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 125/8 పరుగులు చేసింది. ఛేదనలో కివీస్‌ను మలింగ వణికించాడు. వరుసగా టాప్‌-5 వికెట్లు పడగొట్టాడు. 15 పరుగుల వద్ద అతడి విశ్వరూపం మొదలైంది. మూడో ఓవర్‌ మూడో బంతికి కొలిన్‌ మన్రో, నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్‌, ఐదో బంతికి గ్రాండ్‌హోమ్‌, ఆరో బంతికి రాస్‌టేలర్‌ను పెవిలియన్‌ పంపించాడు. దాంతో 3 ఓవర్లకు కివీస్‌ 15/4తో విలవిల్లాడింది. మళ్లీ ఐదో ఓవర్లో బంతి అందుకున్న అతడే నాలుగో బంతికి టిమ్‌ సీఫెర్ట్‌ను ఔట్‌ చేశాడు. చేతులెత్తేసిన కివీస్‌ 88 పరుగులకే కుప్పకూలింది. పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది క్రికెటర్లు, ముంబయి ఇండియన్స్‌ సభ్యులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.