శ్రీలంక ఛీఫ్ సెలక్టర్ పదవికి అశాంత డి మెల్ రాజీనామా చేశారు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో లంక.. 0-2తో ఓటమి పాలైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ శ్రీలంక ధ్రువీకరించింది.
అశాంత సేవలకు గానూ కృతజ్ఞతలు తెలిపింది లంక క్రికెట్ బోర్డు. మరోవైపు జట్టు మేనేజర్ గానూ అశాంత వైదొలిగారు.
ఇదీ చూడండి: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా లంక మాజీ క్రికెటర్