ETV Bharat / sports

15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్​ 5 వికెట్ల ఘనత - 5 wickets for sreeshanth

ఫిక్సింగ్​ నిషేధం తర్వాత దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న భారత బౌలర్​ శ్రీశాంత్​.. తాజాగా 5 వికెట్లతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో 15 ఏళ్ల తర్వాత ఈ ఘనతను మళ్లీ అందుకున్నాడు.

Sreesanth leads Kerala to win with first five-wicket haul in close to 15 years
15 ఏళ్ల అనంతరం శ్రీశాంత్​ 5 వికెట్ల ఘనత
author img

By

Published : Feb 22, 2021, 8:29 PM IST

ఐపీఎల్​ స్పాట్​ ఫిక్సింగ్​ నిషేధం అనంతరం విజయ్​ హజారే ట్రోఫీలో ఆడుతున్న శ్రీశాంత్​.. తిరిగి సత్తా చాటాడు. ఉత్తర్​ప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి కేరళ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​లో 15 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి ఈ ఘనత అందుకున్నాడు.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఉత్తర్​ప్రదేశ్​ 49.4 ఓవర్లకు 283 పరుగులు చేసి ఆలౌటైంది. 9.4 ఓవర్లు బౌలింగ్​ చేసిన శ్రీశాంత్​.. 65 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన కేరళ జట్టు 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

టీమ్​ఇండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు శ్రీశాంత్​.

ఇదీ చదవండి: 'ఇంకెంత కాలం కరోనాకు భయపడుదాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.