ETV Bharat / sports

మహిళా ప్రపంచకప్​ ఫైనల్​కు వచ్చిన అభిమానికి కరోనా

author img

By

Published : Mar 12, 2020, 3:29 PM IST

మహిళా టీ20 ప్రపంచకప్ తుదిపోరు​ చూసేందుకు వచ్చిన ఓ అభిమానికి కరోనా ఉన్నట్లు తేలింది. ఎవరికైనా అలాంటి లక్షణాలు కనిపిస్తే సంప్రదించాలని అధికారులు ఆదేశించారు.

మహిళా ప్రపంచకప్​ ఫైనల్​కు వచ్చిన అభిమానికి కరోనా
భారత మహిళా క్రికెట్ జట్టు

మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​పై ఆస్ట్రేలియా విజయం సాధించి, కప్పు గెలుచుకుంది. మెల్​బోర్న్​ మైదానంలో జరిగిన ఈ పోరుకు దాదాపు 86 వేలమందికి పైగా వీక్షకులు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్​కు హాజరైన ఓ వ్యక్తికి కరోనా ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

melbourne cricket ground
మెల్​బోర్న్ క్రికెట్ మైదానం

స్టేడియంలోని లెవల్ 2 నార్త్​ స్టాండ్​లో కూర్చున్న ఓ అభిమానికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడ కూర్చున్న మిగతావారు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అధికారులు ఆదేశించారు.

ఈ వైరస్​ ప్రభావం వల్ల ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడుతుండగా, మరికొన్ని ప్రేక్షకుల లేకుండానే నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్​లో కరోనా బాధితుల సంఖ్య 70కి చేరుకుంది. ఈ కారణంగానే ఐపీఎల్ నిర్వహణపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

australia cricket team
విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.