ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో 'పొట్టి పోరు'లో ఆ ముగ్గురికి చోటు దక్కేనా?

author img

By

Published : Mar 8, 2021, 3:01 PM IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో సిరీస్​లలో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు పంత్​, సుందర్​, అక్షర్​. అయితే వీరికి మార్చి 12 నుంచి ఇంగ్లాండ్​తో ప్రారంభం కానున్న పొట్టి సిరీస్​లో చోటు దక్కుతుందా అనేది వేచి చూడాలి. భారత రిజర్వ్​బెంచ్​ బలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

special story on panth sundar axar
ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​కు.. ఆ ముగ్గురు తుది జట్టులో ఉంటారా?

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా తొలి టెస్టులో భారీ ఓటమి చవిచూశాక బలంగా పుంజుకుంది. మిగతా మూడు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఆటగాళ్లలో ముగ్గురు యువ క్రికెటర్లు కీలకంగా ఉన్నారు. వారే.. రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌పటేల్‌. ఈ ముగ్గురూ పొట్టి సిరీస్‌కు సైతం ఎంపికైన నేపథ్యంలో తుది జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ సిరీస్‌కోసం ఎంపిక చేసిన జాబితాలో టీమ్‌ఇండియా ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి రాబోయే సిరీస్‌లో వీరికి అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.

పంత్‌కు పోటీగా అతడే..

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లతో పంత్‌ ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లోనే వన్డే, టీ20 ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. తన బ్యాటింగ్‌ను మెరుగు పర్చుకొని భారత్‌కు అపురూప విజయాలు అందిస్తున్నాడు. అలాంటి బ్యాట్స్‌మన్‌ టీ20 సిరీస్‌లో తుది జట్టులో ఉంటాడా లేదా అనేది తెలియదు. ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో అతడికి దీటుగా ఆడే ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిల్‌ ఆర్డర్‌ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. అలాగే కీపింగ్‌లోనూ గత పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో ఆకట్టుకున్నాడు.

special story on panth sundar axar
రిషభ్​ పంత్- కేఎల్​ రాహుల్​

ఇప్పుడు కొత్తగా ఇషాన్‌ కిషన్‌ అనే ముంబయి ఇండియన్స్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు. అతడిని రెండో కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ స్థానంలో పంత్‌ ఉంటాడో లేదో తెలియదు. అయితే, ఇటీవల అతడు ఫామ్‌ అందుకున్న తీరు చూస్తుంటే కచ్చితంగా తుది జట్టులో ఉంటాడనిపిస్తోంది.

వాషింగ్టన్‌కూ ఉన్నారు..

వాషింగ్టన్‌ సుందర్‌ కూడా గత రెండు టెస్టు సిరీస్‌ల్లో బాగా రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20ల్లోనూ భాగస్వామి అయిన అతడు ముఖ్యంగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. శార్దూల్‌ ఠాకుర్‌(67)తో కలిసి సుందర్‌(62) తొలి ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆ మ్యాచ్‌పై టీమ్‌ఇండియా పట్టు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో వాషింగ్టన్‌ 85* పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే నాలుగో టెస్టులో 96* పరుగులతో అజేయంగా నిలిచాడు. అలా లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో పరుగులు సాధిస్తూ కీలకంగా కొనసాగుతున్నాడు.

special story on panth sundar axar
పాండ్యా- సుందర్

అయితే, పొట్టి క్రికెట్‌లో అవకాశం రావాలంటే వాషింగ్టన్‌కు కూడా గట్టి పోటీ ఉంది. అతడు ఆల్‌రౌండర్‌ కావడం వల్ల.. ఈ జాబితాలో హార్దిక్‌ పాండ్య ఇప్పటికే నంబర్‌వన్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు స్పిన్‌ విభాగంలో యుజువేంద్ర చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియా ఎంపికయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వాషింగ్టన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

అక్షర్‌కు మెరుగైన అవకాశాలు..

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన అక్షర్‌ పటేల్‌ మూడు మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. చెన్నై పిచ్‌పై రెండో టెస్టులో ఏడు వికెట్లు సాధించిన అతడు తర్వాత మొతేరాలో వికెట్ల జాతర చేసుకున్నాడు. మూడో టెస్టులో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన (6/38, 5/32) చేశాడు. ఇక చివరి టెస్టులో మరో 9 వికెట్లతో సత్తా చాటడంతో పాటు బ్యాటింగ్‌లోనూ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు.

special story on panth sundar axar
చాహల్- అక్షర్​

కాగా, టీ20 సిరీస్‌ సైతం అదే పిచ్‌పై జరుగుతున్న నేపథ్యంలో అక్షర్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇతర స్పిన్నర్ల నుంచి పోటీ ఎదురైనా అది చాహల్‌ నుంచి మాత్రమే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పొట్టి సిరీస్‌లో ఎవరుంటారో లేదో వేచి చూడాలి.

ఇదీ చదవండి: టెస్టు సిరీస్​ ఓటమికి వారిద్దరే కారణం: సిల్వర్​వుడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.