ETV Bharat / sports

'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'... స్పిన్ పిచ్

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌.. 112 ఆలౌట్‌. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌.. 145 ఆలౌట్‌. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 0/2. చివరికి 81 పరుగులకు ఆలౌట్‌. నిండా రెండు రోజులైనా ఆట సాగలేదు. 140 ఓవర్ల ఆటలోనే 30 వికెట్లు! ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో బ్యాట్స్‌మెన్‌ ఎంత కష్టపడ్డారో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. దీనికి కారణం స్పిన్నర్ల ఉచ్చులో బ్యాట్స్‌మెన్‌ చిక్కుకోవడమే.

special story on motera spin pitch
'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'... స్పిన్ పిచ్
author img

By

Published : Feb 26, 2021, 7:39 AM IST

కొత్త స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ముమ్మాటికీ పిచే! బంతిని సరిగ్గా డిఫెండ్‌ చేసినా హమ్మయ్యా అనుకోవాల్సిన పరిస్థితిలో బ్యాట్స్‌మెన్‌ కాసిన్ని బంతుల్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించారు. సాధారణంగా కొత్త బంతితో పేసర్‌ భయపెడతాడు. కానీ స్పిన్నర్‌ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ వణికిపోయారు.

గురువారం నాడు అక్షర్‌ పటేల్‌ ఆరంభ ఓవర్​లో ఇదే జరిగింది. మొదటి బంతికే క్రాలీ క్లీన్‌బౌల్డ్‌. రెండో బంతికి బెయిర్‌స్టో ఎల్బీ. సమీక్షలో బంతి వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు తేలడం వల్ల బతికిపోయాడు. అయితే అక్షర్‌ మూడో బంతి బెయిర్‌స్టో డిఫెన్స్‌ను చేధిస్తూ వికెట్లను పడగొట్టింది. నిజానికి మూడో టెస్టులో మొదటి రోజు ఉదయం నుంచి ఇదే కథ.

అయ్య స్పిన్నోయ్‌!

బుధవారం ఉదయం తన తొలి ఓవర్‌.. ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్​లో మొదటి బంతికి బెయిర్‌స్టోను అక్షర్‌ ఎల్బీగా ఔట్‌ చేసినప్పటి నుంచి ఇదే తీరు. స్పిన్నర్ల ఉచ్చులో బ్యాట్స్‌మెన్‌ చిక్కుకోవడం.. ఎల్బీ లేదా క్లీన్‌బౌల్డ్‌ అవుతూ పెవిలియన్‌ చేరుకోవడం. బంతి గింగిరాలు తిరగడం.. అనూహ్యంగా దూసుకెళ్లడం.. ఊహించిన దానికంటే తక్కువ ఎత్తులో రావడం.. ఒక్కసారిగా బౌన్స్‌ తీసుకోవడం. బంతిని సమర్థంగా అడ్డుకుంటే అదే గొప్ప. ఆరు బంతులు ఎదుర్కొని వికెట్‌ కాపాడుకుంటే అతిపెద్ద ఘనత. మొతేరా టెస్టులో రెండ్రోజులుగా ఇదే వరస.

special story on motera spin pitch
అశ్విన్ ఆనందం

స్పిన్నర్ల మాయాజాలం..

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లిల భాగస్వామ్యం ఒక్కటే మినహాయింపు. మిగతా వాళ్లంతా దాదాపు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌ల్లో స్పిన్నర్ల ఖాతాలో చేరిన వికెట్లు అక్షరాలా 18. ఇటు ఇద్దరు స్పిన్నర్లు.. అటు ఇద్దరు స్పిన్నర్లే వికెట్లతో ఆటాడుకున్నారు. ఒకవైపు అక్షర్‌ (6/38), అశ్విన్‌ (3/26).. మరోవైపు లీచ్‌ (4/54), రూట్‌. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లన్నీ స్పిన్నర్లే పడగొట్టారు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ రూట్‌ (5/8) తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడంటే మొతేరా పిచ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

special story on motera spin pitch
ఇంగ్లాండ్ దరహాసం

ఆస్ట్రేలియాలో భీకరమైన పేస్‌.. దక్షిణాఫ్రికాలో అనూహ్యమైన బౌన్స్‌.. ఇంగ్లాండ్‌లో ఊహించని స్వింగ్‌, బౌన్స్‌లతో మనోళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలు! అందుకే ఆయా దేశాల్లో ఒక్క టెస్టు మ్యాచ్‌లో నెగ్గినా.. ఒక్కసారి సిరీస్‌ గెలిచినా ఆటగాళ్లకు పండుగలా ఉంటుంది. ఈలెక్కన భారత్‌కు సొంతగడ్డపై పరిస్థితులు అనుకూలంగా ఉండటంలో తప్పులేదు. అనుకూలంగా మలచుకోవడం సంప్రదాయానికి విరుద్ధమేమీ కాదు! మొదట్నుంచీ భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమే. ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లను అందించిన.. అందిస్తున్న ఘనత ఇప్పటికీ భారత్‌దే. బేడి, చంద్రశేఖర్‌, ప్రసన్న, వెంకట్రాఘవన్‌, కుంబ్లే, హర్భజన్‌తో పాటు తాజాగా అశ్విన్‌ వరకు ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

బంతి ఆధిపత్యం..

అయితే గతంలో ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌ ఈస్థాయిలో స్పిన్‌ తుపానులో కొట్టుకుపోయిన దాఖలాలు లేవు! భారత స్పిన్నర్ల ధాటికి ప్రత్యర్థి ఆటగాళ్లు విలవిలలాడినా భారత బ్యాట్స్‌మెన్‌ భారీగా పరుగులు సాధించిన ఉదంతాలెన్నో! మొతేరాలో దృశ్యం పూర్తిగా భిన్నం. బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా స్పిన్‌కు తలవంచాల్సిన పరిస్థితి. బ్యాటుకు బంతికి మధ్య అసలు పోరాటమే లేదు. తొలి రోజు నుంచే పిచ్‌పై దుమ్మురేగింది. సొంతగడ్డ.. అనుకూల పరిస్థితులు.. ఇలా ఎన్ని లెక్కలు వేసుకున్నా స్పిన్‌ మోతాదు కాస్త ఎక్కువైందన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది! బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్య షాట్లు ఉన్నప్పటికీ.. వికెట్లు కూలడంలో ప్రధాన పాత్ర పిచ్‌దే! నిజానికి భారత్‌లో టెస్టు సిరీస్‌ అనగానే స్పిన్‌ పిచ్‌లే సిద్ధమవుతాయి. అయితే మరీ పేసర్ల అవసరం లేనంత స్థాయిలో స్పిన్‌ పిచ్‌ను రూపొందించడం బహుశా ఇదే మొదటిసారేమో! తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌, బుమ్రాలతో మొక్కుబడిగా 11 ఓవర్లు వేయించిన టీమ్‌ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం దయ కూడా చూపలేదు. అక్షర్‌ (5/32), అశ్విన్‌ (4/48)ల జోరుతో మూడో స్పిన్నర్‌ సుందర్‌కూ పనే లేకపోయింది.

తప్పనిసరి!

భారత్‌లో స్పిన్‌ పిచ్‌లపై చర్చలు కొత్త కాకపోయినా మొతేరా మ్యాచ్‌లో మోతాదు మించడం విమర్శలకు తావిచ్చేదే. ఈ పరిస్థితికి భారత జట్టు యాజమాన్యం, బీసీసీఐ కారణం అయ్యుండొచ్చు! ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితుల్లో ఈ సిరీస్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా తొలి టెస్టులో ఓడింది. దీంతో మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గడం లేదా రెండు విజయాలు, ఒక డ్రా నమోదు చేయడం టీమ్‌ఇండియాకు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలోనే ఈ స్పిన్‌ పిచ్‌లు. కానీ అయిదు రోజుల పోరు ఆఖరి వరకు సాగాలని కోరుకునే అభిమానులకు ఇలాంటి మ్యాచ్‌లు.. ఈ తరహా ఫలితాలు ఏమాత్రం రుచించవన్నది కాదనలేని నిజం!

ఈ టెస్టులో రెండు జట్ల రెండో ఇన్నింగ్స్‌ల్లో పేసర్లు ఒక్క బంతీ వేయలేదు. ఫలితం వచ్చిన టెస్టులో ఇలా జరగడం ఇది రెండోసారి.

ఇదీ చూడండి: 2 రోజుల్లోనే ముగిసిన పింక్​ టెస్టు- భారత్​దే విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.