ETV Bharat / sports

వికెట్ల వేటలో దూసుకెళ్తున్న అక్షర్​ - వికెట్ల వేటలో దూసుకెళ్తున్న అక్షర్​

జడేజా గైర్హాజరీతో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్​ పటేల్​.. టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. గులాబి టెస్టులో ఏకంగా 11 వికెట్లు తీసుకున్న ఈ గుజరాతీ స్పిన్నర్​.. ప్రస్తుత టెస్టులోనూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. తనది గాలివాటం కాదని నిరూపిస్తున్నాడు.

special story on axar patel
వికెట్ల వేటలో దూసుకెళ్తున్న అక్షర్​
author img

By

Published : Mar 5, 2021, 6:45 AM IST

ఇప్పటివరకూ ఆడింది రెండున్నర (మూడో టెస్టులో ఇంకో ఇన్నింగ్స్ మిగిలి ఉంది) టెస్టులే కానీ పడగొట్టిన వికెట్లేమో 22. అతని బౌలింగ్ సగటు 10.81. ఇవీ.. అరంగేట్ర టెస్టు సిరీస్​లో ఆదర గొడుతున్న భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ గొప్ప బౌలింగ్ నైపుణ్యానికి నిదర్శనాలు. ఇంగ్లాండ్​తో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగు పెట్టిన ఈ గుజరాతీ స్పిన్నర్ వికెట్ల వేటలో నిలకడ ప్రదర్శిస్తున్నాడు. సాధారణంగా అయితే కొత్తబంతితో పేసర్లు స్వింగ్, పేస్ రాబట్టి వికెట్లు తీస్తారు. కానీ మ్యాచ్ మ్యాచ్​కు మెరుగవుతున్న అక్షర్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కొత్త బంతితోనూ సత్తా చాటడం విశేషం.

మూడో టెస్టు అంటే వేగంగా దూసుకొస్తూ, అనూహ్యంగా ప్రవర్తించే గులాబి బంతితో జరిగింది కాబట్టి అక్షర్ ఆ మ్యాచ్​లో కొత్త బంతితో అద్భుతంగా రాణించాడు. కానీ ఈ మ్యాచ్​లో పిచ్ చూస్తే బ్యాటింగ్​కు అనుకూలంగానే కనిపిస్తోంది.. అలాంటి పరిస్థితుల్లో ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే అతనికి బంతి అందించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తన రెండో బంతికి ఓపెనర్ సిబ్లీని బౌల్డ్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించిన అతను తన ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చాటాడు.

బంతి కొత్తదైనా.. పాతదైనా.. తన ఎత్తును చక్కగా సద్విని యోగం చేసుకుంటూ.. దాన్ని కచ్చితమైన ప్రదేశాల్లో వేస్తూ ఫలితాలు సాధిస్తున్నాడు. ఎక్కువ ఎత్తుతో వేసిన బంతిని డిఫెన్స్ ఆడదామని సిబ్లీ ప్రయత్నించగా.. అది అతని బ్యాట్ లోపలి అంచును ముద్దాడి స్టంప్స్​ను ఎగరగొట్టింది. తాను ఔటైన విధానాన్ని నమ్మలేనట్లుగా అతను పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న మరో ఓపెనర్ క్రాలేని ఓ ఊరించే బంతితో వెనక్కు పంపాడు.

చివర్లో ఒకే ఓవర్లో లారెన్స్, బెస్​ల వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని వేగవంతం చేశాడు. దాదాపు గంటకు పైగా నిలబడి అర్ధశతకం దిశగా సాగుతున్న లారెన్స్​ను.. క్రీజువదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడేలా ప్రేరేపించి స్టంపౌట్​గా బయటకు పంపాడు. ఆ వెంటనే జాక్​ లీచ్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: ఔటయ్యాక నాపై నాకే చిరాకు వేసింది: స్టోక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.