టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది దక్షిణాఫ్రికా. సెప్టెంబర్ 15న ధర్మశాలలో జరిగే తొలి టీ20తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకోసం క్వింటన్ డికాక్ సారథ్యంలోని సఫారీ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది.
మొదటగా దిల్లీలోని సౌతాఫ్రికా హై కమిషనర్‌ను కలవనుంది ప్రొటీస్ బృందం. తర్వాత సెప్టెంబర్ 9న ధర్మశాలకు వచ్చే అవకాశముంది.
ఇరు జట్ల మధ్య రెండో టీ20 మొహాలీలో, మూడో మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. అనంతరం మూడు టెస్టులు ఆడనున్నారు సఫారీలు.
తేదీ | మ్యాచ్ | వేదిక |
సెప్టెంబర్-15 | తొలి టీ20 | ధర్మశాల |
సెప్టెంబర్-18 | రెండో టీ20 | మొహాలీ |
సెప్టెంబర్-22 | మూడో టీ20 | బెంగళూరు |
అక్టోబర్ 2-6 | తొలి టెస్టు | విశాఖపట్నం |
అక్టోబర్ 10-14 | రెండో టెస్టు | పూణె |
అక్టోబర్ 19-23 | మూడో టెస్టు | రాంచి |
ఇవీ చూడండి..