దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య నేడు (ఆదివారం) జరగాల్సిన తొలి వన్డే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆటగాళ్లు ఉంటున్న హోటల్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకడం వల్ల మ్యాచ్ ప్రారంభం కాకుండానే నిలిపేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో వెల్లడించింది. తొలుత మ్యాచ్ నిర్వహించడానికి ముందు కొంత ఆలస్యం చేసినా.. ఆ తర్వాత మ్యాచ్‌ను ఆపేయాలని ఐసీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
-
JUST IN: The first ODI between South Africa and England has been suspended after staff at the hotel England were staying in tested positive for COVID-19.#SAvENG pic.twitter.com/C30sVE98Nm
— ICC (@ICC) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">JUST IN: The first ODI between South Africa and England has been suspended after staff at the hotel England were staying in tested positive for COVID-19.#SAvENG pic.twitter.com/C30sVE98Nm
— ICC (@ICC) December 6, 2020JUST IN: The first ODI between South Africa and England has been suspended after staff at the hotel England were staying in tested positive for COVID-19.#SAvENG pic.twitter.com/C30sVE98Nm
— ICC (@ICC) December 6, 2020
"దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి వన్డే నిలిపివేయడం జరిగింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్లోని సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు" అని ఐసీసీ ట్వీట్ చేసింది.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఆతిథ్య జట్టులో ఓ ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలడం వల్ల మ్యాచ్‌ను ఆదివారానికి వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు వరుసగా రెండు రోజుల్లో (ఆది, సోమవారాల్లో) మ్యాచ్‌లు నిర్వహించాలని యోచించినా.. హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల మ్యాచ్‌ను పూర్తిగా నిలిపేశారు. దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదీ చూడండి: సఫారీ క్రికెటర్‌కు కరోనా.. తొలి వన్డే వాయిదా