ఇటీవల భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన డే/నైట్ టెస్టు విజయవంతమైంది. కోలకతా ఈడెన్‌గార్డెన్స్ మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసింది. ఈ నేపథ్యంలో టీమిండియా తలపడే ప్రతి సిరీస్‌లోనూ ఓ పింక్ టెస్టు ఉంటే బాగుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని బోర్డు సభ్యులతో చర్చిస్తానని అన్నాడు.
"పింక్ టెస్టులో అభిమానులను చూసి చాలా ఆనందమేసింది. ముందుకెళ్లడానికి ఇదే మార్గంగా అనిపించింది. ప్రతి టెస్టు డే/నైట్ ఆడించడం సాధ్యం కాకపోవచ్చు. సిరీస్‌కు ఒకటైతే బాగుంటుంది. ఈ విషయాన్ని బోర్డు సభ్యులతో చర్చిస్తా. ఇతర వేదికల్లోనూ గులాబి బంతితో ఆడించేందుకు మేం ప్రయత్నిస్తాం. ఈడెన్ టెస్టు తర్వాత అందరూ సిద్ధమయ్యారు. ఐదువేల మంది ముందు టెస్టు మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోరు" - సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి గులాబి బంతి మ్యాచ్‌కు నాలుగు రోజుల టికెట్లు ముందుగానే అమ్ముడయ్యాయి. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది.
ఇదీ చదవండి: 1500 మీటర్ల పరుగులో భారత్‌కు 4 మెడల్స్