ETV Bharat / sports

'గంగూలీ చెప్పిన మాటలు నా జీవితంలో నిజమయ్యాయి' - గంగూలీ చెప్పిన మాటలు బ్రెండన్​ మెక్​కల్లమ్ జీవితంలో నిజమయ్యాయి

విధ్వంసక క్రికెటర్ బ్రెండన్​ మెక్​కల్లమ్.. ఐపీఎల్​ తొలి మ్యాచ్​లోని రికార్డు ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకున్నాడు. అప్పటి సహచరుడు సౌరభ్ గంగూలీ చెప్పిన మాటలు.. తర్వాతి కాలంలో నిజమయ్యాయని అన్నాడు.

Sourav Ganguly told me my life is changed forever: Brendon McCullum recalls iconic 158 in IPL opener
'గంగూలీ చెప్పిన మాటలు నా జీవితంలో నిజమయ్యాయి'
author img

By

Published : Apr 18, 2020, 3:28 PM IST

సరిగ్గా ఇదే రోజు.. 12 ఏళ్ల క్రితం ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్​ కోల్​కతా నైట్​రైడర్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. కేకేఎర్ తరఫున ఓపెనింగ్ చేసిన బ్రెండన్​ మెక్​కల్లమ్(కివీస్ మాజీ క్రికెటర్).. టోర్నీ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. లీగ్ ప్రారంభమై 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మళ్లీ ఆ జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.

"ఆరోజు జరిగిన విషయాలు చాలావరకు గుర్తులేవు. కానీ గంగూలీ చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ గుర్తండిపోయాయి. 'నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది' అని దాదా, ఏ ఉద్దేశ్యంతో అన్నాడో తెలియదు గాని ఇప్పుడు నూరు శాతం అతడి మాటలతో అంగీకరిస్తున్నాను. ​ఫ్రాంఛైజీ యాజమాని షారుక్​.. ​'నువ్వు ఎప్పుడూ కేకేఆర్​ సభ్యుడివే' అని అన్నాడు. కెప్టెన్​గా కేకేఆర్​తో కలిసి పనిచేసిన రోజుల్ని ఎంతో గొప్పగా భావిస్తాను. ఇప్పుడు జట్టు యజమాన్యం, కోచ్​ బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో షారుక్​ చెప్పిన​ మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. ఇది నాకు మరో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను"

- బ్రెండన్​ మెక్​కల్లమ్, కివీస్ మాజీ ఆటగాడు

అయితే ఆ ఇన్నింగ్స్ ఆడే ముందు తాను ఎంతో ఒత్తిడిని అనుభవించినట్లు చెప్పాడు మెక్​కల్లమ్. ఆ సమయంలో ఐపీఎల్ అంటే ఏంటో తమలో చాలా మందికి సరిగా తెలియదని, కానీ ఈ లీగ్​ ఆలోచన నచ్చిందని తెలిపాడు. ఇందులో ఆడే అవకాశం వచ్చినందుకు ఇప్పటికీ గర్వంగా ఉంటుందని అన్నాడు. తాను ఘనతల్ని సాధించడంలో జట్టు సభ్యుల కృషి ఎంతో ఉందని వివరణ ఇచ్చాడు.

ఇదీ చూడండి : పునరావాస కేంద్రంగా ఒలింపిక్​ అథ్లెట్స్​ గ్రామం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.