ETV Bharat / sports

'టీమ్​ఇండియా రూపు మార్చిన ఘనత అతడిదే' - Sourav Ganguly Sachin Tendulkar

టీమ్​ఇండియా ఇప్పుడిలా అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతుందంటే అదంతా మాజీ కెప్టెన్ గంగూలీ చలవేనని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్. దాదా అద్భుతమైన సారథి అని ప్రశంసలు కురిపించాడు.

'టీమ్​ఇండియా రూపు మార్చిన ఘనత అతడిదే'
మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్
author img

By

Published : Jul 4, 2020, 3:38 PM IST

తాను ఆడిన వారిలో సౌరభ్ గంగూలీ అత్యుత్తమ కెప్టెన్ అని ప్రశంసించాడు మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్. 2000వ సంవత్సరం తర్వాత టీమ్​ఇండియాలో మార్పులు చేసి విజయవంతమైన జట్టుగా నిలిపిన ఘనత అతడికే దక్కుతుందని అన్నాడు.

Sourav Ganguly
సౌరభ్ గంగూలీ

"2000 తర్వాత టీమ్​ఇండియాలో సమూల మార్పులు చేసిన ఘనత గంగూలీదే. తన స్వభావం, సహచర ఆటగాళ్లకు అండగా నిలవడం సహా జట్టులో సభ్యులకు అన్ని విషయాల్లో నమ్మకం ఏర్పరిచాడు. సెహ్వాగ్​ను ఓపెనర్​గా పంపడం సహా జహీర్​ఖాన్, యువరాజ్​ సింగ్, హర్భజన్ సింగ్​ లాంటి వారిని చాలా అవకాశాలిచ్చాడు" -వసీమ్ జాఫర్, భారత మాజీ క్రికెటర్

కెరీర్​లో 31 టెస్టులు, 2 వన్డేలు ఆడిన జాఫర్.. సచిన్​ సారథిగా ఉన్న సమయంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ద్రవిడ్ కెప్టెన్సీలో 15కుపైగా టెస్టులు ఆడాడు. అయితే గంగూలీ సారథ్యంలో ఆడిన 5 టెస్టుల్లోనూ విఫలమై, కేవలం 149 పరుగులు మాత్రమే చేశాడు. ధోనీ కెప్టెన్​గా ఉన్న సమయంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్​లో పాల్గొన్నాడు వసీమ్.

అయితే గంగూలీ కెప్టెన్​గా వచ్చే సమయానికి జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు, విదేశాల్లో సరిగా ఆడలేదనే అపవాదులు ఉన్నాయి. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్​ఇండియా మార్పులు చేసిన దాదా.. ఆటగాళ్లలో స్ఫూర్తి కలిగించాడు. విదేశాల్లోనూ మ్యాచ్​లు గెలిచేలా చేశాడు. భారత్​ తరఫున విజయవంతమైన సారథుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన.. అగ్రశ్రేణి జట్టుగా చలామణి అవుతుందంటే అందులో గంగూలీ కృషి కూడా ఎంతో ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.