ETV Bharat / sports

ఐపీఎల్ తర్వాతి సీజన్‌ ఏప్రిల్‌, మేలోనే

వచ్చే ఏడాది ఐపీఎల్​ను భారత్​లోనే తిరిగి నిర్వహిస్తామని సౌరభ్​ గంగూలీ చెప్పాడు. ఏప్రిల్​, మే నెలలోనే టోర్నీ ఉంటుందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా గెలుపు.. కెప్టెన్ కోహ్లీపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Sourav Ganguly confirms IPL 2021 in April-May next year will be in india
ఏప్రిల్‌, మేలోనే తర్వాతి సీజన్‌: గంగూలీ
author img

By

Published : Nov 8, 2020, 12:18 PM IST

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ తుది దశకు చేరుకుంది. రెండు మ్యాచ్‌లతో ఈ సీజన్‌ పూర్తి కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆరు నెలలు వాయిదా పడిన మెగా ఈవెంట్‌.. వచ్చే ఏడాది ఎప్పటిలాగే భారత్‌లో నిర్వహిస్తామని, అది కూడా ఏప్రిల్‌, మే నెలలోనే జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఆయన ఇండియాటుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈ ఒక్క సీజన్‌ మాత్రమే యూఏఈలో నిర్వహిస్తున్నామని తర్వాతి సీజన్‌ కచ్చితంగా భారత్‌లోనే కొనసాగిస్తామని చెప్పాడు. అలాగే రెండు, మూడేళ్లలో మహిళల టీ20ల్లోనూ ఏడెనిమిది జట్లు తీసుకొస్తామని పేర్కొన్నాడు. ఈ సీజన్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆ పర్యటనపై స్పందించిన మాజీ సారథి.. అక్కడ కోహ్లీ కెప్టెన్సీపైనే టీమ్‌ఇండియా విజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పాడు.

"చివరిసారి భారత్..‌ కంగారూ పర్యటనకు వెళ్లినప్పుడు 2-1 తేడాతో చారిత్రక టెస్టు విజయం సాధించింది. అయితే, అప్పుడు వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ లేరు. ప్రస్తుతం ఆ ఇద్దరికి తోడు లబుషేన్‌ ఆ జట్టులో రాణిస్తుండటం వల్ల భారత్ గెలవడం‌ అంత సులువు కాదు. దీంతో టీమ్‌ఇండియా విజయాలు విరాట్‌ నాయకత్వంపైనే ఆధారపడ్డాయి"

--సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవాలని, ఎవరిని ఎప్పుడు ఎలా ఆడించాలో అన్నీ కోహ్లీనే చూసుకోవాలని గంగూలీ సూచించాడు. ఐపీఎల్​ పూర్తయిన తర్వాత టీమ్​ఇండియా నేరుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టులు, తలో మూడు వన్డేలు, టీ20​లు ఆడనుంది. నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ఐపీఎల్: కోట్ల ధర పలికారు.. ఉసూరుమనిపించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.