యాషెస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మూడో పోరుకు సిద్ధమవుతోన్న ఆసీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనట్లు... క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
" హెడింగ్లే వేదికగా జరగనున్న యాషెస్ మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. గాయం వల్ల మంగళవారం జరిగిన ట్రైనింగ్ సెషన్లోనూ అతడు పాల్గొనలేకపోయాడు. కోచ్ జస్టిన్ లాంగర్ సూచన మేరకు స్మిత్‌కు మరింత విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం".
-- క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్
మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు శతకాలు చేశాడీ స్మిత్. రెండో టెస్టులో 92 పరుగులతో రాణించాడు. స్మిత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్ మూడో టెస్టులోనూ బరిలోకి దిగనున్నాడు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో... ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రాకాసి బంతికి స్మిత్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగలేదు. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన స్మిత్.. తర్వాతి టెస్టుకు ఆడకపోవడం ఆ జట్టుపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
-
Steve Smith and Jofra Archer engage in one of the truly great Ashes battles
— Ashwin Parwana (@AshwinParwana) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's easy to get used to the idea of cricket as genteel. Especially in English grounds, with the hats and the cakes and the crust-off sandwiches, the way a Test match can burble along until it becomes pic.twitter.com/MwURFZQD6S
">Steve Smith and Jofra Archer engage in one of the truly great Ashes battles
— Ashwin Parwana (@AshwinParwana) August 18, 2019
It's easy to get used to the idea of cricket as genteel. Especially in English grounds, with the hats and the cakes and the crust-off sandwiches, the way a Test match can burble along until it becomes pic.twitter.com/MwURFZQD6SSteve Smith and Jofra Archer engage in one of the truly great Ashes battles
— Ashwin Parwana (@AshwinParwana) August 18, 2019
It's easy to get used to the idea of cricket as genteel. Especially in English grounds, with the hats and the cakes and the crust-off sandwiches, the way a Test match can burble along until it becomes pic.twitter.com/MwURFZQD6S