భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం బాగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్. కాసేపు కూడా క్రికెట్‌ను వదిలి విరామం తీసుకోవడం కష్టంగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని గంటల పాటు విరామం తీసుకోవడం తప్పనిసరి అని అన్నాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
"టెస్టు మ్యాచ్ కోసం సన్నాహకాలు చేస్తున్నా.. కొంత విరామం తీసుకోవడం అనేది చాలా అవసరం. అది ఓ గంటైన పర్లేదు. కానీ ఇలా క్రికెట్‌ను ఊహించుకోకుండా, బ్యాటింగ్‌కు దూరంగా ఉండటం నాకు కష్టంగానే ఉంటుంది" అని ట్వీట్ చేశాడు స్మిత్.
-
Even when preparing for a Test match it’s important to have a little downtime and switch off, even if it’s just for an hour over your Sunday morning coffee. This is not something that comes easy to me as I find it hard to stop visualising the game or shadow batting! #balance pic.twitter.com/jQZ6GiDHmv
— Steve Smith (@stevesmith49) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Even when preparing for a Test match it’s important to have a little downtime and switch off, even if it’s just for an hour over your Sunday morning coffee. This is not something that comes easy to me as I find it hard to stop visualising the game or shadow batting! #balance pic.twitter.com/jQZ6GiDHmv
— Steve Smith (@stevesmith49) December 13, 2020Even when preparing for a Test match it’s important to have a little downtime and switch off, even if it’s just for an hour over your Sunday morning coffee. This is not something that comes easy to me as I find it hard to stop visualising the game or shadow batting! #balance pic.twitter.com/jQZ6GiDHmv
— Steve Smith (@stevesmith49) December 13, 2020
డిసెంబరు 17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి. కాగా, ఇరుజట్ల మధ్య ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో వన్డేను ఆసీస్, టీ20సిరీస్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకున్నాయి.
ఇదీ చూడండి : స్మిత్‌కు కెప్టెన్సీ?.. గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు