శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) నూతన డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఎల్సీ ధ్రువీకరించింది.
లంక క్రికెట్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నియమించిన సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు మూడీ నియామకం జరిగింది.
'2021 మార్చి 1 నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా టామ్ మూడీని నియమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. దేశంలో క్రికెట్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నియమించిన సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు అతని నియామకం జరిగింది.' అని ఎస్ఎల్సీ ట్విట్టర్లో పేర్కొంది.
గతంలో లంక జట్టుకు కోచ్‌గా రెండేళ్లు పనిచేశాడు మూడీ. ఆయన కాలంలోనే శ్రీలంక జట్టు 2007 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతోపాటు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుత సీజన్‌కు సన్‌రైజర్స్ జట్టు డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చదవండి: రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్