ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్​ప్రీత్​ దూరం

author img

By

Published : Mar 19, 2021, 9:07 PM IST

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​కు ముందు భారత మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా తొలి టీ20కి కెప్టెన్ హర్మన్​ప్రీత్​ సింగ్​ అందుబాటులో ఉండట్లేదని వైస్​ కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది.

Skipper Harmanpreet ruled out of T20 opener against South Africa, informs Mandhana
దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్​ప్రీత్​ దూరం

దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి భారత కెప్టెన్ హర్మన్​ప్రీత్ సింగ్​ దూరమైంది. ఐదో వన్డే ఆడుతూ గాయపడ్డ ఆమె​.. మొదటి టీ20 మ్యాచ్​కు అందుబాటులో ఉండదని వైస్​ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ శనివారం ప్రారంభం కానుంది.

'సౌతాఫ్రికాతో తొలి టీ20కి హర్మన్​ప్రీత్​ అందుబాటులో ఉండట్లేదు. తదుపరి వివరాలు వైద్యబృందం సూచన మేరకు వెల్లడిస్తాం' అని మంధాన పేర్కొంది.

ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను 1-4 తేడాతో కోల్పోయింది ఆతిథ్య భారత జట్టు. దీనిపై స్పందించిన మంధాన.. ప్రస్తుత పొట్టి సిరీస్​పైనే తాము దృష్టి సారించామని తెలిపింది. "వన్డే సిరీస్​ సంతృప్తికరంగా సాగలేదు. దాని గురించి మరచిపోవడానికి ప్రయత్నిస్తాం. టీ20 సిరీస్​ కోసం కొత్త ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. కాబట్టి తాజాగా ఆలోచించాలి" అని వైస్​ కెప్టెన్ వెల్లడించింది.

ఇదీ చదవండి: డిస్కస్​ త్రోలో జాతీయ రికార్డుతో ఒలింపిక్స్​కు మరో అథ్లెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.