గతేడాది రంజీ ట్రోఫీలో బంగాల్ జ్టటు తరఫున ఆడిన టీమ్ఇండియా సీనియర్ పేసర్ అశోక్ దిండా.. క్రమశిక్షణ ఉల్లంఘనల కారణంగా నిషేధానికి గురయ్యాడు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన దిండా.. జట్టులో జరిగిన రాజకీయ కుట్రలకు తాను బలైనట్లు తెలిపాడు. ఈ సారి జరగబోయే సీజన్లో కొత్త జట్టుతో బలమైన ఆటగాడిగా ముందుకొస్తానని వెల్లడించాడు.
ఇప్పటికే పలు జట్ల నుంచి ఆహ్వానం అందిందని.. దానిపై చర్చలు కూడా జరుపుతన్నట్లు అన్నాడు. త్వరలోనే బంగాల్ క్రికెట్ సంఘానికి ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు.
"ఇకపై బంగాల్ జట్టులో ఆడకూడదని గత సీజన్లోనే నిశ్చయించుకున్నా. ఇది నా వ్యక్తిగత విషయం. బాలీవుడ్ హీరో సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలు, కుట్రలు అన్ని రంగాల్లో ఉంటాయి. కానీ నేను మానసికంగా దృఢంగా ఉంటాను. నన్ను ఎవరు ఏమి చేయలేరు. వేరే రాష్ట్రం తరఫున ఆడతాను. ఈ ఏడాది జరగబోయే సిజన్‌కు ముందే.. ఏ జట్టు తరఫున ఆడతానో తెలియజేస్తాను."
-అశోక్ దిండా, టీమ్ఇండియా సీనియర్ పేసర్.
గతేడాది.. బౌలింగ్ కోచ్ రణదీప్‌ను బహిరంగంగా దూషించాడనే కారణంతో అశోక్ దిండాపై బంగాల్ రాష్ట్ర క్రికెట్ సంఘం వేటు వేసింది.
ఇది చూడండి : 'అర్జున అవార్డుకు ప్రణయ్‌ను నామినేట్ చేయాలి'