ఇటీవలే వెస్టిండీస్ ఏ-ఇండియా ఏ మధ్య జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. కానీ వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టెస్ట్, టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ గిల్‌కు అవకాశం కల్పించలేదు.
ప్రపంచకప్ సెమీస్‌లో ఓడి ఇంటిముఖం పట్టిన భారత్‌కు మిడిలార్డర్ పెద్ద సమస్యగా మారింది. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఈ స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు శుభ్‌మన్‌కు మొండిచేయి చూపించారు.
వెస్టిండీస్-ఏతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో... 54.50సగటుతో 218 పరుగులు సాధించాడు గిల్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌నూ గెల్చుకున్నాడు.
-
Brilliant series win and happy to have won the player of the tournament. Always proud to wear the blue of India 🇮🇳💙 pic.twitter.com/t1u7CouAqk
— Shubman Gill (@RealShubmanGill) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Brilliant series win and happy to have won the player of the tournament. Always proud to wear the blue of India 🇮🇳💙 pic.twitter.com/t1u7CouAqk
— Shubman Gill (@RealShubmanGill) July 22, 2019Brilliant series win and happy to have won the player of the tournament. Always proud to wear the blue of India 🇮🇳💙 pic.twitter.com/t1u7CouAqk
— Shubman Gill (@RealShubmanGill) July 22, 2019
"వెస్టిండీస్ పర్యటన ఎంపికకై ఎదురుచూశా. ఏదో ఒక ఫార్మాట్లో చోటు దక్కుతుందని భావించా. స్థానం లభించకపోవడంపై నిరాశ చెందా. కానీ అదే ఆలోచిస్తూ కూర్చోను. మరిన్ని పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తా".
-శుభమన్ గిల్, యువ క్రికెటర్
ఈ పర్యటన కోసం జట్టును ప్రకటించే సందర్భంలో గిల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో ప్రస్తావించాడు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
"ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రాహుల్‌కు గాయమైంది. అప్పుడు జట్టులోకి వచ్చాడు గిల్. రాహుల్ పునరాగమనంతో గిల్‌కు ఎదురుచూపులు తప్పలేదు. భవిష్యత్తులో అతడి ఎంపికను పరిశీలిస్తాం".
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్
వెస్టిండీస్-ఏతో జరిగే టెస్టు సిరీస్ జట్టులో ఉన్నాడు శుభ్‌మన్. మొదటి మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది.
ఇవీ చూడండి.. 'జట్టులో వారు లేకపోవడం ఆశ్చర్యకరం'