ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అరంగేట్రం చేసి సత్తాచాటాడు టీమిండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే. దేశవాళీలో ఆకట్టుకుంటున్న ఈ క్రికెటర్ ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెడతానని అంటున్నాడు. అదే విధంగా జట్టులో స్థానాన్ని సుస్థిరపరచుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు.
"ఫిట్‌గా ఉండేందుకు గంటల కొద్ది శ్రమిస్తా. ఆల్‌రౌండర్‌గా నా స్కిల్స్ పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. మ్యాచ్‌లు లేని సమయాల్లో నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతా. అక్కడ నేర్చుకున్నవి మ్యాచ్‌ల్లో అమలు చేస్తా. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృష్టి సారిస్తున్నందున కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆల్‌రౌండర్‌గా ఉన్నపుడు ఇలాంటివి ఎదుర్కొనక తప్పదు. జట్టులో స్థానాన్ని సుస్థిరపరచుకోవాలని అనుకుంటున్నా" - శివమ్ దూబే, టీమిండియా ఆల్‌రౌండర్
ప్రస్తుతం దూబే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై తరపున ఆడుతున్నాడు. వచ్చే నెలలో జరిగే భారత పర్యటనకు వెస్టిండీస్ రానుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లో దూబే ఎంపికయ్యాడు. విండీస్‌తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది టీమిండియా.
ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్‌లో.. చివరిది ముంబయిలో