వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శివమ్ దూబే(54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రిషభ్ పంత్(33) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరో 2 వికెట్లతో రాణించగా.. పియర్రే, జేసన్ హోల్డర్, కాట్రెల్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్(11) వికెట్ కోల్పోయింది. తర్వాత విరాట్ స్థానంలో వచ్చిన శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్(15) సాయంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అప్పుడే కుదురుకున్నాడనుకున్నా హిట్‌మ్యాన్.. హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
Innings Break!
— BCCI (@BCCI) December 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
After being put to bat first, #TeamIndia post a total of 170/7 on the board.
Updates - https://t.co/bYoPMmEa5C #INDvWI pic.twitter.com/ssHV2JeqeP
">Innings Break!
— BCCI (@BCCI) December 8, 2019
After being put to bat first, #TeamIndia post a total of 170/7 on the board.
Updates - https://t.co/bYoPMmEa5C #INDvWI pic.twitter.com/ssHV2JeqePInnings Break!
— BCCI (@BCCI) December 8, 2019
After being put to bat first, #TeamIndia post a total of 170/7 on the board.
Updates - https://t.co/bYoPMmEa5C #INDvWI pic.twitter.com/ssHV2JeqeP
దూబే అర్ధశతకం..
ఆరంభంలో నిదానంగా ఆడినప్పటికీ అనంతరం బ్యాట్ ఝుళిపించాడు దూబే. పొలార్డ్ వేసిన తొమ్మిదో ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి యువరాజ్‌సింగ్‌ను గుర్తు చేశాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో వాల్ష్ బౌలింగ్‌లో హేడెన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
చివర్లో టపాటపా..
తొలి టీ20లో 94 పరుగులతో విధ్వంసం సృష్టించిన విరాట్.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. 17 బంతుల్లో 19 పరుగులే చేసి.. విలియమ్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అక్కడ నుంచి టీమిండియా స్కోరు వేగం మందగించింది. చివర్లో వరుస వికెట్ల కోల్పోయీ అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.
అగ్రస్థానంలో విరాట్..
టీ20ల్లో అత్యధికంగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ(2563) అగ్రస్థానంలోకి వచ్చాడు. రోహిత్ శర్మ(2562), మార్టిన్ గప్తిల్(2436), షోయబ్ మాలిక్‌లు(2263) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: దక్షిణాసియా క్రీడల్లో రెజ్లర్ సాక్షిమాలిక్‌కు స్వర్ణం