ETV Bharat / sports

రీల్​ 'గబ్బర్​'తో రియల్ గబ్బర్​ సెల్ఫీ - చాహల్​ దంపతులు వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్​ కుమార్​ను టీమ్ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​ కలిశాడు. ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని గబ్బర్​ తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు. దీంతో పాటు చాహల్ దంపతులకు ధావన్​.. తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ.. చాహల్​ ఓ ఫొటోను పంచుకున్నాడు.

Shikhar Dhawan Shares Pic With Akshay Kumar
రీల్​ 'గబ్బర్​'తో రియల్ గబ్బర్​ సెల్ఫీ
author img

By

Published : Feb 2, 2021, 12:05 PM IST

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను కలిశాడు. ఎప్పుడు ఎక్కడ కలిశాడనే సమాచారం లేకపోయినా ఆ హీరోతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. మీతో ఉన్నంతసేపూ సరదాగా ఉంటుందని దానికి వ్యాఖ్యానం జతచేశాడు. ఓ చెరువుగట్టు పక్కన ఇద్దరూ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ధావన్‌ అభిమానులతో పంచుకున్నాడు.

అంతకుముందు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు ధావన్‌ను కలిశారు. ఆ ఫొటోను ఈ స్పిన్‌ మాంత్రికుడు తన ఇన్‌స్టాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ధావన్‌ మంచి ఆతిథ్యం ఇచ్చాడని పేర్కొన్నాడు. కాగా.. ధావన్‌, చాహల్‌ చివరిసారి ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడారు. ఆపై వారు తిరిగి భారత్‌కు చేరుకున్నారు.

ఇక ఆసీస్‌ పర్యటనకు ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధావన్‌ రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో అతడు 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేశాడు. అందులో రెండు వరుస శతకాలు బాది ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్: వీరి ధర చాలా ఎక్కువ గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.