ETV Bharat / sports

రాహుల్​తో పోటీనా? అదేం లేదు: ధావన్ - team india t20 squad

ఏడాది తర్వాత తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​. వరుస గాయాలతో సతమవుతున్న ధావన్​ సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్​ జట్టులో స్థానం సాధించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపాడు. కివీస్​ సిరీస్​కు తన స్థానంలో బరిలో దిగిన కేఎల్​ రాహుల్​ తనకు పోటీ కాదని.. జట్టులో స్థానం రావడం, రాకపోవడం సెలక్షన్​ కమిటీపై ఆధారపడి ఉంటుందన్నాడు.

Shikhar Dhawan on Competition for openers spots in T20 Worldcup squad
ధావన్​ స్థానంపై కన్నేసిన కెఎల్​ రాహుల్​?
author img

By

Published : May 15, 2020, 5:52 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​.. దాదాపు ఏడాది కాలం తర్వాత జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​ జట్టులో స్థానం కోసం తన వంతుగా కష్టపడతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అవకాశం దొరికితే నిరూపించుకోవడానికి సిద్ధమని తెలిపాడు. సెలక్షన్​ అనేది తన పరిధిలోని విషయం కాదు కాబట్టి ప్రదర్శనతోనే అందర్నీ ఆకర్షించాలని చూస్తున్నాడు గబ్బర్​.

శిఖర్​ ధావన్​ గాయాలతో విశ్రాంతి తీసుకున్న సమయంలో అతని స్థానంలో కేఎల్ రాహుల్​ను బరిలోకి దించింది జట్టు యాజమాన్యం. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అత్యుత్తమ ప్రదర్శన అందించాడీ యువక్రికెటర్​. కివీస్​తో జరిగిన 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 224 పరుగులు సాధించాడు. దీంతో మళ్లీ ఓపెనర్​గా ధావన్​ జట్టులోకి వస్తాడా.. లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. రాహుల్​.. వికెట్​ కీపర్​గా మారి రిషబ్​ అవకాశాన్ని ఎలా చేజార్చాడో.. ధావన్​కు ఇప్పడదే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

'రాహుల్​ నాకు పోటీ కాదు'

అయితే ఈ విషయంపై స్పందించిన శిఖర్​ ధావన్​.. రాహుల్​ తనకు పోటీ కాదు అంటున్నాడు. జట్టులోకి తాను రావడం, రాకపోవడం సెలెక్షన్​ కమిటీ మీద ఆధారపడి ఉంటుందని.. దాని గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోవడం తప్ప ఉపయోగం లేదని తెలిపాడు. రాహుల్​ బ్యాటింగ్ శైలిపై ప్రశంసలు కురిపించాడు ధావన్​. శ్రీలంక సిరీస్​లో అతని బ్యాటింగ్​ వేరే స్థాయిలో ఉందని కొనియాడాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడగలిగే నేర్పు రాహుల్​లో ఉందని అన్నాడు.

ఇదీ చూడండి.. 'ప్రపంచకప్​ కంటే దేశవాళీ మ్యాచ్​లు బెటర్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.