కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభిస్తుండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్‌లు తాత్కాలికంగా రద్దయ్యాయి. ఈ కారణంగా తీరిక లేకుండా ఆడుతున్న టీమ్‌ఇండియా క్రికెటర్లకు కాస్త విరామం దొరికింది. వారు సమయాన్ని వృథా చేసుకోకుండా కుటుంబంతో కాలక్షేపం చేస్తూ కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టీమ్‌ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన సహచరులు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌కు సవాల్ విసిరాడు. తనలా దిండు సవాలును స్వీకరించాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోరాడు.
దిండు సవాలు (బ్లైండ్ పిల్లో ఫైట్) నెటిజన్లకు సుపరిచితమే. ముఖానికి ముసుగు వేసుకొని దిండులతో సరదాగా ఆడుకోవడాన్ని దిండు సవాలు అంటారు. అయితే ఎవరు దిండుతో ఇతరులను ముందుగా తాకుతారో వారే గెలిచినట్లుగా భావిస్తారు. ధావన్ కూడా తన కుటుంబంతో సరదాగా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "ఇంట్లో కూర్చోవడం సరదాగా ఉండదని ఎవరు చెప్పారు? దాని కోసం మనం మార్గాలను వెతుక్కోవాలి. దిండు సవాలును మీరూ ప్రయత్నించండి" అని వీడియోకు వ్యాఖ్య జత చేస్తూ హిట్‌మ్యాన్, హార్దిక్, కుల్‌దీప్, చాహల్‌ను ట్యాగ్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">