ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఇదివరకు ఈ రికార్డు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పేరిట ఉండేది. ధవన్ 52 పరుగుల వద్ద ఈ రికార్డును అధిగమించాడు.
టీ-20ల్లో మొత్తం 1,605 పరుగులు చేసిన రైనా.. ఇటీవలే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మూడో స్థానంలో టీమ్ఇండియా డాషింగ్ ఆల్‌రౌండర్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (1177 పరుగులు) ఉన్నాడు.
టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్లు వీరే..
శిఖర్ ధవన్* - 1,606
సురేశ్ రైనా - 1,605
యువరాజ్ సింగ్ - 1,177
గౌతమ్ గంభీర్ - 932
మొత్తంగా మూడో స్థానంలో..
మొత్తంగా.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ధోనీని దాటి శిఖర్ మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
ఇదీ చూడండి: రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం