మహిళల క్రికెట్లో కొత్త రూల్స్‌కు బదులుగా ప్రచారంతో అభిమానులను మరింతగా స్టేడియాలకు రప్పించవచ్చని అభిప్రాయపడింది టీమ్ఇండియా బౌలర్ శిఖా పాండే. ఇప్పటికే ఉమెన్స్ గేమ్‌లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం సహా పిచ్ పరిమాణం తగ్గించి మ్యాచ్‌లు నిర్వహించాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా మహిళల మ్యాచ్‌లకు మరింత ప్రేక్షకాదరణ ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా ట్విట్టర్లో స్పందించింది శిఖా పాండే.
-
I have been reading/ hearing a lot about the changes being suggested to help grow women's cricket/ make it a more attractive product. I personally feel most of the suggestions to be superfluous.
— Shikha Pandey (@shikhashauny) June 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
(1/n)
">I have been reading/ hearing a lot about the changes being suggested to help grow women's cricket/ make it a more attractive product. I personally feel most of the suggestions to be superfluous.
— Shikha Pandey (@shikhashauny) June 27, 2020
(1/n)I have been reading/ hearing a lot about the changes being suggested to help grow women's cricket/ make it a more attractive product. I personally feel most of the suggestions to be superfluous.
— Shikha Pandey (@shikhashauny) June 27, 2020
(1/n)
"100మీ, 400మీ వంటి ఒలింపిక్ పరుగుపందేల్లో పురుషులు, మహిళలు ఒకే దూరం పరుగెత్తుతారు కదా! మరి క్రికెట్లో పిచ్ పరిధిని తగ్గించడం ఎందుకు? బంతి పరిమాణం తగ్గించడం అంగీకారమే. కానీ, సైజ్ తగ్గినా బంతి అంతే బరువు ఉండేలా చూడాలని, అలా చేస్తేనే బౌండరీలు ఎక్కువ వచ్చే అవకాశంతో పాటు బౌలర్లకు గ్రిప్ సహకరిస్తుందని ఇయాన్ స్మిత్ తెలిపాడు. మహిళల మ్యాచ్‌ల్లో వృద్ధి కావాలంటే తగిన ప్రచారం అవసరం. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించలేం".
- శిఖా పాండే, టీమ్ఇండియా బౌలర్
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌ను చూడటానికి ఏకంగా 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.
కచ్చితంగా మార్పు వస్తుంది
మహిళల క్రికెట్లో చిన్న బంతిని ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువ షాట్లు కొట్టడానికి వీలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవిన్. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ఉమెన్గా సోఫీ నిలిచింది. మహిళల క్రికెట్లో కొత్త రూల్స్‌కు మద్దతుగా నిలుస్తూ.. చిన్న బంతిని ప్రవేశపెట్టడం ద్వారా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది డెవిన్.
ఇది ట్రై చేయండి
పిచ్‌ను తగ్గించాలనే సూచన కంటే క్రికెట్‌ను మరింత వినోదాత్మకంగా మార్చడానికి మరో ఆలోచన ఉందని తెలిపింది టీమ్ఇండియా బ్యాట్స్ఉమెన్ జెమిమా రోడ్రిగ్స్. షార్ట్పిచ్పై సన్నాహక మ్యాచ్‌లను నిర్వహించి పరిశీలిస్తే దానికి వచ్చే ఆదరణ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో ముందుకు సాగవచ్చని వెల్లడించింది. ఈ ఆలోచనను ప్రయత్నించడంలో తప్పేముందని.. చివరికి మహిళల క్రికెట్‌కు తగిన ప్రచారం కల్పిస్తూ ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేసింది రోడ్రిగ్స్.