టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్... మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించిన గబ్బర్.. మహీ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ల సమయంలో పరుగులు చేయలేకపోయినా.. ధోనీ మద్దతుగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు.
ఆ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ గెలవడం గర్వకారణంగా అభివర్ణించాడు ధావన్. జట్టుగా రాణించడం వల్లే అద్భుతమైన విజయం సాధించామని గుర్తుచేసుకున్నాడు.
సచిన్ వంటి దిగ్గజంతో ఆడటం తన డ్రీమ్ అని.. అది నెరవేరిందని చెప్పుకొచ్చాడు ధావన్. మాస్టర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు.
గబ్బర్ పేరు ఎలా వచ్చిందంటే..?
భారత మాజీ కీపర్ విజయ్ దహియా.. గబ్బర్ అనే పేరు పెట్టినట్లు చెప్పాడు ధావన్. దానికి కారణాన్ని వివరించాడు. ఫీల్టింగ్ సమయంలో అందర్నీ నవ్వించడానికి గబ్బర్ డైలాగ్లు చెప్పేవాడినని పేర్కొన్నాడు. అలా తనకు ఆ పేరు పెట్టినట్లు వెల్లడించాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనున్న ఐపీఎల్లో.. దిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు శిఖర్ ధావన్.
-
Thank you everyone for all your questions #AskShikhar pic.twitter.com/bP3vzNdeax
— Shikhar Dhawan (@SDhawan25) July 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you everyone for all your questions #AskShikhar pic.twitter.com/bP3vzNdeax
— Shikhar Dhawan (@SDhawan25) July 28, 2020Thank you everyone for all your questions #AskShikhar pic.twitter.com/bP3vzNdeax
— Shikhar Dhawan (@SDhawan25) July 28, 2020