వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి విజృంభించింది భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ(69). సెయింట్ లూసియా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆమె అర్ధశతకంతో ఆకట్టుకోగా. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 30 పరుగులతో నిలకడగా ఆడింది. ఫలితంగా టీమిండియా అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో గెలిచారు. 5 టీ20ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లారు.
-
India win by 10 wickets!
— ICC (@ICC) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Youngster Shafali Verma impressing with the bat once again 🔥
They take a 2-0 lead in the five match series.#WIvIND pic.twitter.com/D0j0VKBr8k
">India win by 10 wickets!
— ICC (@ICC) November 10, 2019
Youngster Shafali Verma impressing with the bat once again 🔥
They take a 2-0 lead in the five match series.#WIvIND pic.twitter.com/D0j0VKBr8kIndia win by 10 wickets!
— ICC (@ICC) November 10, 2019
Youngster Shafali Verma impressing with the bat once again 🔥
They take a 2-0 lead in the five match series.#WIvIND pic.twitter.com/D0j0VKBr8k
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. కరీబియన్ జట్టులో చెడీన్ నేషన్(32) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
104 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన టీమిండియాలో ఓపెనర్లు అదరగొట్టారు. వికెట్ కోల్పోకుండా.. 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా షెఫాలి వర్మ 35 బంతుల్లో 69 పరుగులతో మరోసారి విధ్వంసం సృష్టించింది. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శనివారం జరిగిన తొలి టీ20లో 73 పరుగులతో ఆకట్టుకున్న ఈ 15ఏళ్ల యువ క్రీడాకారిణి రెండో మ్యాచ్లోనూ అదే రీతిలో ఆకట్టుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి 30 పరుగులు చేసి షెఫాలీకి సహకరించింది.
ఇదీ చదవండి: కష్టానికి తగిన ఫలితం దక్కింది: చాహర్