ETV Bharat / sports

'పృథ్వీ షా తన షాట్లతో సెహ్వాగ్​ను మరిపిస్తాడు' - Wasim Jaffer latest news

యువ బ్యాట్స్​మెన్ పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్​లను ప్రశంసించాడు మాజీ క్రికెటర్​ వసీం జాఫర్​. పృథ్వీ, తన షాట్లతో సెహ్వాగ్​ను మరిపిస్తాయని చెప్పాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్నా సరే ఈ యువ ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమవుతున్నారని అన్నాడు.

Shaw is special, needs to understand his game better: Jaffer
'పృథ్వీషా తన షాట్లతో సెహ్వాగ్​ను మరిపిస్తాడు'
author img

By

Published : Jul 9, 2020, 5:28 PM IST

Updated : Jul 9, 2020, 6:26 PM IST

టీమ్​ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షాపై మాజీ క్రికెటర్​, ఉత్తరాఖండ్​ రంజీ జట్టు కోచ్​ వసీం జాఫర్​ ప్రశంసలు కురిపించాడు. ఈ ఓపెనర్​ ఆటతీరును దిగ్గజ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​తో పోల్చాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు జాఫర్​.

Shaw is special, needs to understand his game better: Jaffer
వసీం జాఫర్​

"నాకు తెలిసినంత వరకు పృథ్వీషా ఓ ప్రత్యేక ఆటగాడు అనడంలో సందేహమే లేదు. ఆతని ఆటతీరు, బంతిని బాదే విధానం సెహ్వాగ్​లా ఉంటుంది. ప్రత్యర్థులను పృథ్వీ షా సమర్థవంతంగా ఎదుర్కోగలడు. కానీ, అతడు ఆటను ఇంకొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది."

- వసీం జాఫర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

టీమ్​ఇండియా యువ ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​ గురించి జాఫర్​ మాట్లాడుతూ.. అతను మంచి ఆటగాడు అయినప్పటికీ ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని తెలిపాడు. "తనకు లభించిన కొన్ని అవకాశాల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. విదేశాల్లో నిరూపించుకోవడం మయాంక్​కు సవాలుగా మారింది" అని జాఫర్​ అభిప్రాయపడ్డాడు.

క్రికెటర్​గా 24 ఏళ్ల కెరీర్​ పూర్తయిన తర్వాత ఈ ఏడాది మార్చి 7న ఆటకు వీడ్కోలు పలికాడు జాఫర్​. 260 ఫస్ట్ ​క్లాస్​ మ్యాచ్​లు, టీమ్​ఇండియా తరఫున 31 టెస్టులు, రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీలో ముంబయి జట్టు ఆటగాడిగా కెరీర్​ ప్రారంభించి 2015-16 సీజన్​లో విదర్భ జట్టుకు మారాడు​.

Last Updated : Jul 9, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.