చాలారోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు త్వరలో మొదలుకానున్నాయి. వీటిని బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఇలా జరిగితే బంతిపై లాలాజలం వినియోగించడం పెద్ద ఇబ్బంది కాదని అన్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్. బంతిపై మెరుపు కోసం సలైవాను రుద్దకూడదని ఐసీసీ చెప్పిన నేపథ్యంలో పొలాక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ప్రత్యేకంగా సృష్టించిన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. అది ఓ రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. మ్యాచ్‌లకు ముందే స్వీయ నిర్బంధం పూర్తి చేసుకుని, అంతా సురక్షితంగా ఉంటారు. వైరస్ లక్షణాలున్న వ్యక్తులతో వారు కలవనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అప్పుడు బంతిపై లాలాజలం ఉపయోగించడం సమస్యే కాదు" -షాన్ పొలాక్, దక్షిణాఫ్రికా మాజీ బౌలర్
ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌తో బయో సెక్యూర్ వాతావరణం పద్ధతిని ఉపయోగించనున్నారు. జులై 8, జులై 16, జులై 24వ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటన్నింటిని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.