ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. తాజాగా లీగ్‌ల నుంచీ తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ క్రికెట్‌పై తనకున్న ప్రేమతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 299 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడిన వాట్సన్ 2018 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నాడు.
ఆటపై ప్రేమంటే అది
గతేడాది ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వాట్సన్ చూపిన తెగువ క్రికెట్ అభిమానుల్ని కట్టిపడేసింది. అతడికి ఆటపై ఉన్న ప్రేమను తెలియజేసింది. ఆ మ్యాచ్‌లో వాట్సన్ మోకాలికి గాయమై రక్తం కారుతున్నా చివరి వరకు పోరాడాడు. 80 పరుగులు చేసి జట్టు విజయం కోసం చాలా శ్రమించాడు. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. కానీ వాట్సన్ చూపిన పట్టుదలను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.