ఆస్ట్రేలియా బౌలర్ షేన్‌వార్న్‌కు ఊహించని షాకిచ్చింది లండన్ న్యాయస్థానం. ఏడాది పాటు డ్రైవింగ్ చేయకూడదని ఆదేశాలిచ్చింది. రెండేళ్లలో ఆరుసార్లు మితిమీరిన వేగంతో కారు నడిపినట్లు తెలిపింది.
ఇంగ్లాండ్‌లోని పశ్చిమ లండన్‌లో ఉంటోన్న వార్న్.. గంటకు 64 కిమీ వేగంతో వెళ్లాల్సిన రహదారిలో... 75 కిమీ వేగంతో తన కారులో దూసుకెళ్లాడు. గతేడాది ఇలాగే మితిమీరిన వేగంతో నడిపి పోలీసులకు చిక్కాడు. వార్న్ పదే పదే రహదారి నియమాలు ఉల్లఘించినందుకు ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేసింది. నిషేధంతో పాటు దాదాపు రూ.లక్షా 62వేలు జరిమానా విధించింది.
అత్యధిక వికెట్ల బౌలర్...
ఆస్ట్రేలియా తరఫున 45 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు షేన్ వార్న్. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ముత్తయ్య(800) తర్వాత 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడీ మాజీ క్రికెటర్.