ETV Bharat / sports

'ఆ ఒక్క మార్పుతో టీ20లు రసవత్తరంగా మారతాయి' - షేన్​ వార్న్​ వార్తలు

టీ20 ఫార్మాట్​లో బ్యాట్స్​మన్​, బౌలర్​ మధ్య సమతూకం రావాలంటే కొన్ని మార్పులు చేయాలని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్​ షేన్ వార్న్​ అన్నాడు. ఈ ఫార్మాట్​లో బౌలర్​కు గరిష్ఠంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధన తీసేసి.. ఐదు ఓవర్ల పద్దతిని తీసుకురావాలని పేర్కొన్నాడు.

shane warne
షేన్ వార్న్
author img

By

Published : Sep 8, 2020, 5:30 AM IST

టీ20 ఫార్మాట్​లో ఎక్కువగా బ్యాట్స్​మన్​ ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకే ఓవర్​లో 20 పరుగులకు పైగా సాధించి.. బౌలర్​ను ముప్పుతిప్పలు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కడో అడపా దడపా మాత్రమే బౌలర్లు రాణించారు. అయితే బంతి, బ్యాట్ మధ్య సమతూకం రావాలంటే.. టీ20 ఫార్మాట్​లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్​ షేన్​ వార్న్​ పేర్కొన్నాడు.

ఈ ఫార్మాట్​లో బౌలర్​ గరిష్ఠంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధన తొలగించి ఐదు ఓవర్ల పద్దతిని ప్రవేశపెట్టాలని తెలిపాడు వార్న్. ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి కామెంటరీ చేస్తున్న క్రమంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు.

"టీ20 ఫార్మాట్​లో ఒక్కో బౌలర్​ ఐదు ఓవర్లు వేస్తే.. బ్యాటింగ్​, బౌలింగ్​ మధ్య పోరు సమంగా ఉంటుంది. ఈ ఫార్మాట్​లో బౌలర్లను కుదించాలి. ఐదుగురు బౌలర్లతో 20 ఓవర్లు జరిపే స్థానంలో.. నలుగురు బౌలర్లతో ఐదేసి ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. ఈ మార్పును నేను టీ20ల్లో చూడాలనుకుంటున్నా."

-షేన్​ వార్న్​, ఆసీస్​ బౌలర్​

జట్టులో ఎనిమిది మంది బౌలర్లు ఉన్నప్పటికీ.. ఓవర్ల కోటాను పెంచడం వల్ల మ్యాచ్​ రసవత్తరంగా మారుతుందని వార్న్ అభిప్రాయపడ్డాడు. "మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఐదు ఓవర్లు వేయగలరని.. దాని వల్ల బ్యాట్స్​మన్​, స్పిన్నర్​​ మధ్య మంచి పోరు నెలకొంటుందని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.