ETV Bharat / sports

'నేను ఆడకపోవడం భారత్​కు కలిసొచ్చింది' - ప్రపంచకప్​లలో వైఫల్యంపై అఫ్రిది స్పందన

టీమ్​ఇండియా గురించి మాట్లాడుతూ మరోసారి సెల్ఫ్​గోల్​ వేసుకున్నాడు పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది. ప్రపంచకప్​లలో తాను సరిగ్గా ప్రదర్శన చేయకపోవడం వల్లే భారత్​ గెలిచిందని తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నాడు.

Shahid Afridi despite accepting the truth that he failed diserably against India in WC saying India was Lucky
షాహిద్​ అఫ్రిది
author img

By

Published : Aug 3, 2020, 9:40 AM IST

పాకిస్థా‌న్‌ క్రికెట్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది టీమ్‌ఇండియాపై కామెంట్‌ చేస్తూ మరోసారి సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నాడు. ఇటీవల ట్విటర్‌లో తన అభిమానులతో ముచ్చటించిన అతడిని ఓ నెటిజన్​ ఆసక్తికర ప్రశ్న వేశాడు. "భాయ్‌ మీ మీద ఉన్న గౌరవంతో అడుగుతున్నా.. ప్రపంచకప్‌లలో టీమ్‌ఇండియాపై ఎందుకంత ఘోరంగా విఫలమయ్యారు? అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 56 పరుగులు చేసి, ఒకటే వికెట్‌ తీశారు. అందుకు కారణం ఏంటని అనుకుంటున్నారు‌?" అని సూటిగా అడిగేశాడు. దానికి స్పందించిన మాజీ క్రికెటర్‌. ఏం చెప్పాలో అర్థం కాక.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఇలా అన్నాడు. 'టీమ్‌ఇండియా లక్కీ' అనుకుంటానని నవ్వుతున్న ఏమోజీతో రీట్వీట్‌ చేశాడు.

అయితే, అఫ్రిది సమాధానంపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై గంభీర్‌ ప్రతి స్పందించాలని జోక్‌ చేశారు. పాక్‌ మాజీ సారథి తన వైఫల్యాన్ని చాలా సమర్థవంతంగా కప్పిపుచ్చుకున్నాడని అన్నారు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ.. "అవును మేం అదృష్టవంతులమే. నువ్వు ఆడిన ప్రతీ మ్యాచ్‌ మేమే గెలిచినందుకు అదృష్టవంతులమే" అని పేర్కొన్నారు. మరికొందరు ఏకంగా అఫ్రిది పలు సందర్భాల్లో డకౌట్‌ అయిన వీడియోలు పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, 1999 నుంచీ అతడు ప్రపంచకప్‌లు ఆడుతున్నా ఒక్కసారైనా భారత్‌పై 22 పరుగులకు మించి చేయలేదు. తొలిసారి 6 పరుగులు చేసిన అతడు 2003లో 9 పరుగులే చేశాడు. అనంతరం 2011లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్నా అఫ్రిది ఛేదనలో 19 పరుగులే చేశాడు. ఇక 2015లో 22 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా చూస్తే పాక్‌ మాజీ క్రికెటర్‌ టీమ్‌ఇండియా చేతిలో ఘోరంగా విఫలమయ్యాడని స్పష్టంగా తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.