ETV Bharat / sports

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. పాక్ బౌలర్ రికార్డు - షాహిన్ అఫ్రిదీ ఇంగ్లాండ్ కౌంటీ

ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ యువ బౌలర్ షాహిన్ అఫ్రిదీ రెచ్చిపోయాడు. హాంప్​షైర్ తరఫున ఆడుతున్న ఇతడు మిడిల్సెక్స్​తో జరిగిన మ్యాచ్​లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.

షాహిన్
షాహిన్
author img

By

Published : Sep 21, 2020, 12:14 PM IST

పాకిస్థాన్‌ యువ బౌలర్ షాహిన్‌ అఫ్రిదీ విజృంభించాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇంగ్లాండ్‌ కౌంటీలో భాగంగా హాంప్‌షైర్‌, మిడిల్సెక్స్ మధ్య ఆదివారం టీ20 మ్యాచ్‌ జరిగింది. అందులో షాహిన్‌ 6/19తో రెచ్చిపోయాడు. జాన్‌ సింప్సన్‌, స్టీవెన్‌ ఫిన్‌, తిలాన్‌, టిమ్‌ ముర్తాఘ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చి రికార్డు సృష్టించాడు. అఫ్రిదీ దెబ్బకు మిడిల్సెక్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసింది. ఛేదనలో మిడిల్సెక్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడటం వల్ల 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాహిన్‌ అఫ్రిదీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

పాకిస్థాన్‌ తరఫున టీ20ల్లో వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాహిన్‌ రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే మూడో బౌలర్‌. ఇంతకుముందు శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగ, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఈ ఘనత సాధించారు. కాగా.. నాలుగు వికెట్లలో నాలుగు క్లీన్‌ బౌల్డ్‌లే ఉండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.