ETV Bharat / sports

ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​: షెఫాలీ వర్మ@2 - స్మృతి మందాన వన్డే ర్యాంక్

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ).. మహిళల క్రికెట్​ టీ20, వన్డే ర్యాంకింగ్స్​ను మంగళవారం విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో యువ బ్యాట్స్​వుమన్​ షెఫాలీ వర్మ రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు వన్డే బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో స్మృతి మంధాన ఏడో స్థానంలో నిలిచింది.

Shafali rose to second spot; Mandhana, Rodrigues remain static at 7th and 9th in T20I rankings
ఐసీసీ మహిళా క్రికెట్​​ ర్యాంకింగ్స్​: రెండోస్థానంలో షఫాలీ
author img

By

Published : Mar 9, 2021, 4:50 PM IST

Updated : Mar 10, 2021, 6:32 AM IST

మహిళా క్రికెట్​ టీ20, వన్డే ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యువ కెరటం షెఫాలీ వర్మ 744 పాయింట్ల రెండోస్థానానికి చేరుకోగా.. వైస్​కెప్టెన్​ స్మృతి మంధాన(693) 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్​(643) 9వ ర్యాంకులో నిలిచింది. అయితే టీ20 బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో 748 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన బేత్​ మూనీ అగ్రస్థానంలో నిలిచింది.

టీ20 బౌలింగ్​ జాబితాలో..

టీ20 ర్యాంకింగ్స్​లో భారత మహిళా బౌలర్​ దీప్తి శర్మ 716 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా.. రాధా యాదవ్​, పూనమ్​ యాదవ్​ చెరో స్థానాన్ని కోల్పోయి.. వరుసగా 8,9 స్థానాలకు చేరుకున్నారు. ఈ జాబితాలో 799 పాయింట్లతో ఇంగ్లాండ్​కు చెందిన సోఫీ ఎక్లెస్టన్ అగ్రస్థానంలో ఉంది.

మహిళల వన్డే క్రికెట్​ ర్యాంకింగ్స్​:

ఈ​ ర్యాంకింగ్స్​లో భారత మహిళల జట్టు వైస్​కెప్టెన్​ స్మృతి మంధాన ఒక స్థానం కోల్పోయి.. 721 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. టీమ్ఇండియా కెప్టెన్​ 691 పాయింట్లతో 9వ ర్యాంక్​లో కొనసాగుతోంది. అయితే ఈ జాబితాలో 765 పాయింట్లతో ఇంగ్లాండ్​కు చెందిన టామీ బ్యూమంట్​ తొలి ర్యాంక్​ను సొంతం చేసుకుంది.

వన్డే బౌలింగ్​ జాబితాలో..

ఈ జాబితాలో టీమ్ఇండియాకు చెందిన జూలన్​ గోస్వామి, పూనమ్​ యాదవ్​ వరుసగా 5, 6 ర్యాంకుల్లో నిలవగా.. మరో భారత బౌలర్​ శిఖా పాండే ఒక స్థానాన్ని కోల్పోయి 8వ ర్యాంకుకు చేరింది. ఇందులో అత్యధికంగా 804 పాయింట్లతో జెస్​ జోనాస్సేన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే భారత మహిళా జట్టుతో జరిగిన తొలివన్డేలో వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్​ షబ్నిమ్​ ఇస్మాయిల్​ రెండోస్థానానికి చేరుకుంది.

ఇదీ చూడండి: దెబ్బకు దెబ్బ: రెండోవన్డేలో మిథాలీసేనదే గెలుపు

Last Updated : Mar 10, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.