ETV Bharat / sports

సెహ్వాగ్​ బ్యాటింగ్​కు రామాయణానికి సంబంధమేంటి? - సెహ్వాగ్​కు బ్యాటింగ్​కు రామాయణానికి సంబంధమేంటి?

టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ పోస్ట్​ను షేర్ చేశాడు. ఇందులో రామాయణానికి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసి తన బ్యాటింగ్​ టెక్నిక్​ను ఇక్కడి నుంచే స్ఫూర్తి పొందానని తెలిపాడు.

సెహ్వాగ్
సెహ్వాగ్
author img

By

Published : Apr 13, 2020, 3:22 PM IST

టీమ్​ఇండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​ లాక్​డౌన్​లో​ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్టులతో అభిమానులను ఎంటర్​టైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ రామాయణం సీరియల్​పై ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన బ్యాటింగ్​ స్టైల్​ను రామాయణం నుంచే స్ఫూర్తి పొందానని చెప్పాడు.

రామాయణ పురాణంలోని వానర సైన్యంలో ఒకరైన అంగధుడ్ని ప్రేరణగా తీసుకున్నాడట సెహ్వాగ్. తన ఫుట్‌వర్క్‌ను అంగధుడితో పోల్చుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా టీవీలో ప్రసారం అవుతున్న రామాయణాన్ని వీక్షిస్తున్న అతడు.. ఒక ఫోటోను పోస్ట్‌ చేశాడు. సీత‌ను రావ‌ణుడు అప‌హ‌రించిన త‌ర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్‌ చేస్తాడు. త‌న పాదాన్ని ఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓట‌మిని అంగీక‌రించిన‌ట్లే అని అంటాడు. అయితే అంగ‌ధుడి పాదాన్ని క‌దిపేందుకు లంకేయులు ప్ర‌య‌త్నించి విఫలం అవుతారు. ఇదే విషయం తనకు వర్తిస్తుందన్నట్లు పోస్ట్ చేశాడు సెహ్వాగ్.

సెహ్వాగ్ బ్యాటింగ్ శైలిని చూసుకుంటే నిల్చున్న చోట నుంచే ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. అతడి ఫుట్‌వర్క్‌పై ఇప్పటికీ చాలామందికి అనుమానాలున్నాయి. అసలు కాలు కదపకుండా ఎలా విరుచుకుపడతాడనే సందేహం చాలామందిలో ఉంది. అప్పట్లో సెహ్వాగ్‌ ఫుట్‌వర్క్‌పై చాలామంది విమర్శలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్నే ఆ పోస్ట్ ద్వారా వీరు చెప్పాలనుకున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.