ETV Bharat / sports

'బంతి గమనాన్ని బట్టే నా ఆట ఉంటుంది' - రిషబ్ పంత్​ వ్యాఖ్యలు

పిచ్​ తీరును అంచనా వేశాకే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించానని భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్​ పంత్ అన్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టులో శతకం చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

See the ball and react that's my USP says Pant
'బంతి గమనాన్ని బట్టి స్పందించాలి'
author img

By

Published : Mar 5, 2021, 7:36 PM IST

పిచ్​ తీరును బట్టి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాలని భారత వికెట్ కీపర్, బ్యాట్స్​మెన్​​ రిషభ్​ పంత్ అన్నాడు. అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టులో శతకం సాధించిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడాడు.

"రివర్స్​ షాట్స్​ ఆడగలమా లేదా అని ముందుగానే అంచనా వేయాలి. ఇలాంటి షాట్లు ఆడే అవకాశం నాకు వచ్చింది. కానీ, బౌలర్లు మెరుగ్గా బౌలింగ్​ చేస్తే గౌరవించి సింగిల్స్​ తీయాలనుకున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నా. బంతి వస్తున్న తీరును చూసి స్పందించాలి. ఇదే దృష్టిలో పెట్టుకొని నా ఆట ఆడాను."

-రిషభ్​ పంత్​

పంత్ 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. సిక్సర్​తో సెంచరీ సాధించి ఆ వెంటనే అండర్సన్​ బౌలింగ్​లో రూట్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇదీ చదవండి:'భవిష్యత్తులో పంత్​ గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.